ఛాలెంజింగ్ పాత్రలకు రెడీ అంటున్న రెజీనా

Update: 2020-04-15 06:30 GMT
రెజీనా కసాండ్రా మొదటినుంచి టాలీవుడ్ లో దాదాపుగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేస్తూ వచ్చింది. అప్పుడప్పుడు గ్లామర్ డాల్ రోల్స్ కూడా చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. అయితే గత కొంతకాలంగా మాత్రం రెజీనా క్రేజీ ఆఫర్లు రాలేదు. స్టార్ హీరోల సినిమాలలో కూడా రెజీనా పేరు పరిశీలించడం లేదు. దీంతో రెజీనా తన రూట్ పూర్తిగా మార్చేసింది. నటనకు స్కోప్ ఉండే క్లిష్టమైన పాత్రలను.. ప్రతినాయిక ఛాయలున్న పాత్రను కూడా ఎంచుకోవడం ప్రారంభించింది. అదే కోవలో '7' 'ఎవరు' సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఈ సినిమాలే కాదు ప్రస్తుతం రెజీనా నటిస్తున్న 'నేనే నా' చిత్రంలో కూడా నటనకు ప్రాధాన్యమున్న పాత్ర దక్కిందని రెజీనా చెప్తోంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ తన పాత్రల ఎంపికపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఇప్పటివరకు పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు.. గ్లామరస్ రోల్స్ చేశానని.. ఇకపై నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు.. బోల్డ్ పాత్రలు.. రొటీన్ కి భిన్నంగా ఉండే పాత్రలు చేయాలని ఆసక్తిగా ఉన్నానని తెలిపింది.

నిజానికి రెజీనా ఇప్పటికే ఇలాంటి పాత్రలు యాక్సెప్ట్ చేస్తోంది. బాలీవుడ్లో 'ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా' అనే సినిమాలో ఒక లెస్బియన్ ప్రేమికురాలి పాత్రలో నటించింది. నిజానికి ఒక సౌత్ హీరోయిన్ ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలో నటించడం సాధారణమైన విషయమేమీ కాదు. రెజీనా వరస చూస్తుంటే ఫ్యూచర్ లో మంచి అవకాశాలు దక్కేలాగానే ఉన్నాయి. ఎందుకంటే హీరోయిన్లు ఎల్లకాలం గ్లామర్ పాత్రలు చెయ్యలేరు. కనుక నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ పోతే రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటీమణుల తరహాలో కెరీర్ కు లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంటుంది. మరి రెజీనా కూడా అంత మంచి పేరు తెచ్చుకుంటుందో లేదో వేచి చూడాలి. 
Tags:    

Similar News