ర‌ప్పాడించేస్తోన్న కీర్తి సురేష్‌!

తాజాగా కోలీవుడ్ లో మ‌రో రెండు ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసిన‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది.;

Update: 2026-02-19 22:30 GMT

టాలీవుడ్ లో కీర్తి సురేష్ జ‌ర్నీ ఎలా ప్రారంభ‌మై ఎలాంటి ట‌ర్నింగ్ లు తీసుకుందో చెప్పాల్సిన ప‌నిలేదు. `మ‌హాన‌టి` త‌ర్వాత కెరీర్ ఒక‌లా సాగుతుంద‌నుకుంటే? అందుకు భిన్నంగా ప్ర‌యాణం మందుకు సాగింది. కేవ‌లం డీసెంట్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వ్వాల‌నుకున్న అమ్మ‌డి స్ట్రాట‌జీ కొంత వ‌ర‌కూ వ‌ర్కైట్ అయింది. కానీ ఇలాగే కొన‌సాగితే మొద‌టికే ముప్పు వ‌స్తుంద‌ని భావించిన అమ్మ‌డు ఒక్క‌సారిగా ట్రాక్ మార్చేసింది. వ‌డి వడిగా గ్లామ‌ర్ పాత్ర‌ల వైపు అడుగులు వేసింది. అదే స‌మ‌యంలో వివాహం అవ్వ‌డం క‌లిసొచ్చింది. అప్ప‌టికే పెళ్లైన భామ‌ల‌కు ఇండ‌స్ట్రీలో డిమాండ్ ఏర్ప‌డ‌టంతో? కీర్తి సురేష్ కి కూడా అవ‌కాశాలు మెరుగు ప‌డ్డాయి.

మునుప‌టి కంటే కొత్త అవ‌కాశాలు అందుకోవ‌డంలో వేగం పుంజుకుంది. 2024 లో నాలుగు సినిమాల‌తో ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లోనే ఉంది. అటుపై ఏడాది రెండు సినిమాల‌తో అల‌రించింది. ఇదే స‌మ‌యంలో బాలీవుడ్ ఎంట్రీ కూడా జ‌రిగిపోయింది. అయితే డెబ్యూ అక్క‌డ ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. అలాగ‌ని న‌టించిన సినిమాల‌న్నీ విజ‌యం సాధించాయా? అంటే అదీ జ‌ర‌గ‌లేదు. త‌న పాత్ర వ‌ర‌కూ న్యాయం చేసినా పైన‌ల్ ఔట్ పుట్ ప్రేక్ష‌కుల్ని నిరాశ ప‌రిచింది. ఇందులో కీర్తి త‌ప్పిందం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. తాజాగా అమ్మ‌డి కిట్టీలో చాలా ప్రాజెక్ట్ లు క‌నిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం త‌మిళ్ లో `క‌న్నైవేడి` అనే చిత్రంలో న‌టిస్తోంది. మ‌ల‌యాళంలో `తొట్ట‌మ్` అనే మ‌రో చిత్రంలోనూ న‌టిస్తోంది. తెలుగులో `రౌడీ జ‌నార్ద‌న` తోనూ బిజీగా ఉంది. ఇవి గాక వెంక‌టేష్ హీరోగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలోనూ ఈ భామ‌నే హీరోయిన్ గా ప‌రిశీలిస్తున్నారు. ఇంత వ‌ర‌కూ ఈ జోడీ వెండి తెర‌పై క‌నిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆజోడీపై ఆస‌క్తి నెల‌కొంది. అలాగే `మ‌హేంద్ర‌గిరి వాన‌ర‌`లోనూ అతిధి పాత్ర‌లో న‌టిస్తోంది. తాజాగా కోలీవుడ్ లో మ‌రో రెండు ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసిన‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది.

అలాగే హిందీలో కూడా ఓ సినిమాకు క‌మిట్ అయింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మాలీవుడ్ లో కూడా ఓ సీనియ‌ర్ స్టార్ కు జోడీగా న‌టిస్తుంద‌ని వార్త‌లొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ల‌కు సంబంధించి అధికారికంగా విష‌యం వెల్ల‌డి కావాల్సి ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్ లో కీర్తి సురేష్ ఇంత బిజీ గా మారుతుంద‌ని తాను కూడా ఊహించి ఉండ‌దు. అమ్మ‌డికి వెంకటేష్ ప్రాజెక్ట్ కీల‌క‌మైంది. ఇందులో వెంకీకి జోడీగా సెట్ అయితే గ‌నుక మిగ‌తా సీనియ‌ర్ హీరోల స‌ర‌స‌న ఛాన్సులు అందుకో వ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఇప్ప‌టికే చిరంజీవి, ర‌జ‌నీకాంత్ లాంటి స్టార్స్ చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News