• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరు152 లో రెజినా.. అది...

చిరు152 లో రెజినా.. అది సంగతి!

By - Tupaki Desk
Update: 2019-12-31 04:57 GMT
మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్లో  #చిరు152 కొద్దిరోజుల క్రితం లాంచ్ అయింది. ఈమధ్యే మెగాస్టార్ లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఒక స్పెషల్ సాంగ్ కోసం బ్యూటిఫుల్ రెజినాను ఎంచుకున్నారని.. రెజినా మెగాస్టార్ తో స్టెప్పులేయడం ఖాయమని కూడా ఈ మధ్య వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇందులో సగమే నిజమని సమాచారం.

ఈ సినిమా లో ప్రత్యేక గీతం కోసం కొరటాల టీమ్ రెజినా కసాండ్రా ను సంప్రదించిన మాట వాస్తవమేనట. అయితే రెజినా ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని టాక్ వినిపిస్తోంది. విభిన్నమైన పాత్రలు లేదా నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలు చేసేందుకు రెజినా సిద్ధమట కానీ ఐటమ్స్ సాంగ్స్ లో ఆడిపాడేందుకు తను ఆసక్తి చూపించడం లేదట. అందుకే ఇది క్రేజీ ఆఫర్ అయినప్పటికీ 'నో' చెప్పిందని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమే అయితే రెజినా చాలా బోల్డ్ డెసిషన్ తీసుకుందనే చెప్పాలి. కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించే చిత్రం ఒక క్రేజీ ప్రాజెక్టు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి వ్యక్తం అవుతోంది. మిగతా హీరోల సినిమాలో స్పెషల్ సాంగ్స్ ఎలా ఉంటాయో ఏమో కానీ మెగాస్టార్ సినిమాలో ఐటెం సాంగ్ హిట్ అయితే ఆ హీరోయిన్ కు భారీ గుర్తింపు దక్కుతుంది. ఇలాంటి ఆఫర్ ను రెజినా తిరస్కరించడం ఆశ్చర్యమే.

రెజినాకు ఇప్పుడు తెలుగులో పెద్దగా ఆఫర్లు లేవు కానీ తమిళం లో మాత్రం ఫుల్లుగా సినిమాలు ఉన్నాయి. రెజినా ప్రస్తుతం 'కల్లాపార్ట్'. 'కసడతపర'.. 'చక్ర' అనే సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా ఈమధ్య హిందీలో కూడా ఒక సినిమా సైన్ చేసిందనే టాక్ ఉంది.


Tags:    
  • Chiru 152 
  • Tollywood 
  • Tollywood News 
  • Tupaki News 
  • Ram Charan 
  • Regina Cassandra 
  • Tupaki Updates 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS