అ.. అయినా అదృష్టం తెచ్చేనా?

Update: 2017-12-04 04:18 GMT
సినిమాలో హీరోలను.. సినిమా చూస్తున్న ప్రేక్షకులను కవ్వించే అందం ఉంది. కమర్షియల్ హీరోకు ఉండాల్సిన అట్రాక్టివ్ ఫిగర్ ఉంది. నటనలో నవరసాలను పండించే నేర్పు ఉంది. ఇలా అన్నీ ఉన్నా కాలం కలిసిరాని హీరోయిన్లలో చెన్నై చిన్నది రెజీన్ కెసాండ్రా పేరు ముందే ఉంటుంది. ఈ అమ్మడికి అవకాశాల విషయంలో లోటు లేనప్పటికీ అదృష్టమే అచ్చిరావడం లేదు.

టాలీవుడ్ లో చాలాకాలంగా హీరోయిన్ గా నటిస్తున్నా రెజీనా ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ లేదు. ఆమె చేసిన వాటిలో ఒకటి రెండు హిట్లున్నా అవి హీరోల ఖాతాలోకి వెళ్లిపోయాయి. దీంతో ఈమధ్య నారా రోహిత్ హీరోగా వచ్చిన బాలకృష్ణుడు సినిమాపై రెజీనా చాలా ఆశలే పెట్టుకుంది. ఇది కంప్లీట్ కమర్షియల్ సినిమా కావడంతో ఇది హిట్టయితే తన కెరీర్ కొత్త టర్న్ తీసుకుంటుందని ఆశపడింది. కానీ అదేమో బాక్సాఫీస్ ముందు పల్టీ కొట్టింది. దాంతో రెజీనా ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘అ’ సినిమాలో రెజీనా ఓ చిన్న పాత్ర చేస్తోంది. ఇంతకాలంగా కోరుకున్న బ్రేక్ ఈ సినిమాతో వస్తుందేమో చూడాలి.

కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ సిద్ధం చేసిన ‘అ’ కథ నచ్చి నిర్మించేందుకు నాని రెడీ అయ్యాడు. వాల్ పోస్టర్ బ్యానర్ తో తీస్తున్న ఈ మూవీలో రెజీనాతోపాటు కాజల్‌ - నిత్యమీనన్ - అవసరాల శ్రీనివాస్ నటిస్తున్నారు.  ఇందులో మొక్కకు మాస్ మహరాజా రవితేజ.. చేపకు నాని వాయిస్ ఓవర్ అందివ్వనుండటం విశేషం.
Tags:    

Similar News