• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రష్మిక - విజయ్ పెళ్లి...

రష్మిక - విజయ్ పెళ్లి ఫిక్స్.. కన్ఫర్మ్ చేసిన అధ్యక్షుడు!

| గత నాలుగు సంవత్సరాలుగా ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

By - Madhu Reddy
Update: 2026-01-21 06:10 GMT

గత నాలుగు సంవత్సరాలుగా ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలసి తొలిసారి నటించిన చిత్రం గీతా గోవిందం. ఈ సినిమా సమయం నుంచే వీరిద్దరి మధ్య ఎఫైర్ రూమర్స్ గుప్పుమన్నాయి. దీనికి తోడు వీరిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా కలిసి నటించారు.ఈ సినిమా తర్వాత వీరిద్దరూ ఎక్కడ కలిసి కనిపించినా ఈ రూమర్స్ మరింత బలంగా వినిపించాయి.

అయితే మీడియా కంట పడకుండా ఈ జంట ఎంత ప్రయత్నం చేసినప్పటికీ.. ఆడియన్స్, నెటిజన్స్ నుండి తప్పించుకోలేకపోయారు. ఇక ఎట్టకేలకు గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని కూడా వీరు బయట పెట్టలేదు.ముఖ్యంగా తమ వ్యక్తిగత జీవిత విషయానికి సంబంధించిన విషయాలను వీరు గోప్యంగా ఉంచడం అభిమానులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇకపోతే ఈ ఏడాది ఉదయపూర్ లో ఫిబ్రవరి 26వ తేదీన ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక దీనిపై స్పందిస్తూ.. గత నాలుగు సంవత్సరాలుగా ఇలాంటి రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే సమయం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది అంటూ తనదైన శైలిలో స్పష్టం చేసింది. అయితే రష్మిక, విజయ్ దేవరకొండ తో పెళ్లి పై క్లారిటీ ఇవ్వనుందా లేక మరేదైనా ట్విస్ట్ ఇస్తుందా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఎదురుచూసిన అభిమానులకు ఎప్పటికప్పుడు నిరాశే మిగులుతోంది. అయితే సడన్గా ఒక వ్యక్తి వీరిద్దరి వివాహాన్ని కన్ఫర్మ్ చేస్తూ చేసిన కామెంట్లతో అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన తాజాగా విజయ్ - రష్మిక జంటకు విషెస్ చెబుతూ.. వారి పెళ్లికి తమ తరఫున అత్యంత నాణ్యమైన డచ్ గులాబీలు పంపనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఫ్లవర్స్ వారి వేడుకను మరింత అందంగా మారుస్తాయని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తానికైతే ఇంతవరకు రష్మిక - విజయ్ దేవరకొండ నుంచీ తమ పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సడన్గా ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీకాంత్ చేసిన కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆయన ఈ విషయంపై స్పష్టం చేశారు అంటే కచ్చితంగా వీరి బంధం నిజమే.. ఇక త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది అంటూ నిర్ధారణకు వచ్చేస్తున్నారు. ఏదేమైనా రష్మిక - విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటే చూడాలని ఆకాంక్షించే అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఉన్నారడంలో సందేహం లేదు.

Tags:    
  • vijaydeverakonda 
  • rashmikamandanna 
  • vijayrashmika 
  • tollywoodcouple 
  • udaipurwedding 
  • flowercouncilindia 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS