శర్వానంద్ నెక్స్ట్.. స్పెషల్ ఏమిటంటే..

యంగ్ హీరో శర్వానంద్ సంక్రాంతి బరిలో నిలిచి ఒక డీసెంట్ సక్సెస్ అందుకున్నారు. చాలా కాలం తర్వాత నారి నారి నడుమ మురారి తో ఒక హిట్ దక్కడంతో కెరీర్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్లయింది.;

Update: 2026-01-21 04:15 GMT

యంగ్ హీరో శర్వానంద్ సంక్రాంతి బరిలో నిలిచి ఒక డీసెంట్ సక్సెస్ అందుకున్నారు. చాలా కాలం తర్వాత నారి నారి నడుమ మురారి తో ఒక హిట్ దక్కడంతో కెరీర్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్లయింది. ఇదే జోష్ లో తన నెక్స్ట్ మూవీ 'బైకర్' ను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది.

నిజానికి ఈ సినిమా గతేడాది డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సింది, కానీ మేకర్స్ ప్లానింగ్ లో జరిగిన కొన్ని మార్పుల వల్ల వాయిదా పడింది. బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే కథ కాబట్టి, ఆడియన్స్ కి కొత్త ఫీల్ ఇవ్వడానికి ఈ సినిమాను 3D, 4DX ఫార్మాట్లలో కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కేవలం కంటెంట్ మీద మాత్రమే కాకుండా విజువల్ ఎక్స్‌పీరియన్స్ మీద కూడా టీమ్ నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

అయితే ఈ సినిమాలో శర్వానంద్ ఒకేసారి తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాలో ఇలాంటి డ్యూయల్ రోల్ ప్రయోగం చేయడం అనేది ఒక రిస్క్ తో కూడుకున్న విషయమే. కథలో ఆ పాత్రల మధ్య ఎమోషన్ సరిగ్గా కుదిరితేనే ఈ ప్రయోగం పండుతుంది. శర్వానంద్ తన కెరీర్ లో మొదటిసారి ఇలాంటి విభిన్నమైన పాత్రలు చేస్తుండటంతో దీనిపై చర్చ జరుగుతోంది.

మరోవైపు ఈ ప్రాజెక్ట్ లో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో షూటింగ్ సమయంలో ఆయనకు గాయం కావడం వల్ల షెడ్యూల్స్ కొంత అటు ఇటు అయ్యాయి. ఇప్పుడు ఆయన కోలుకుని సెట్స్ లో జాయిన్ అవ్వడం సినిమాకు ప్లస్ పాయింట్. శర్వానంద్ తో రాజశేఖర్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.

దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర ఈ సినిమాను టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. జిబ్రాన్ సంగీతం, మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ నిర్మిస్తున్నారు. బైక్ రేసింగ్ సినిమాలకు తెలుగులో మార్కెట్ పరిమితంగా ఉంటుంది కాబట్టి, మేకర్స్ మేకింగ్ విషయంలో ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. శర్వానంద్ కు ఈ 'బైకర్' ఒక ఇంపార్టెంట్ ఫిలిం అని చెప్పవచ్చు. సంక్రాంతి హిట్ ఇచ్చిన ఊపును కంటిన్యూ చేయాలంటే ఈ ప్రయోగాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలబడటం చాలా ముఖ్యం. త్వరలోనే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ తండ్రీకొడుకుల రేసింగ్ కథ ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News