• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రాధే శ్యామ్' అప్డేట్...

'రాధే శ్యామ్' అప్డేట్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్ సూసైడ్ లెటర్..!

By - Tupaki Desk
Update: 2021-11-11 16:32 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ''రాధే శ్యామ్''. 1970స్ కాలం నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్ కథాంశంతో దర్శకుడు కె కె రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - టీ సిరీస్ - గీతాకృష్ణ సంస్థలు కలసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదలకు రెండు నెలలు మాత్రమే సమయం ఉన్నా చిత్ర బృందం ప్రమోషన్స్ చేయడం లేదని అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

'రాధే శ్యామ్' సినిమా పాటలు మరియు ఇతర కంటెంట్ కోసం అందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మూడేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ - టీజర్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్నా ప్రభాస్ సినిమా గురించి అప్‌డేట్స్ ఇవ్వకపోవడం.. ఇంకా ఫస్ట్ సింగిల్ కూడా వదలకపోవడం పై డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అదే సంక్రాంతి కి విడుదలయ్యే 'ఆర్.ఆర్.ఆర్' 'భీమ్లా నాయక్' నుంచి వరుస అప్డేట్స్ వస్తుండటం వారికి బాధ కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' దర్శకుడు రాధాకృష్ణను - యూవీ క్రియేషన్స్ ను ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అయితే ఇప్పుడు వారి అసహనం తారా స్థాయికి చేరుకొంది. ఎంతవరకు అంటే ఏకంగా సూసైడ్ లెటర్ రాసే వరకు వెళ్ళింది. ప్రభాస్ అభిమాని ఒకరు యువీ క్రియేషన్స్‌ సంస్థకు నవంబర్ 11వ తేదీన సూసైడ్ నోట్ పేరుతో లేఖ రాశారు. ఇంతవరకు ఒక లెటర్ కూడా రాయని తాను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదని.. మీరు అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదని అభిమాని ఇందులో ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం తన చావు చూసైనా 'రాధేశ్యామ్' అప్‌డేట్ ఇస్తారని అనుకొంటున్నానని అభిమాని లేఖలో మరింత భావోద్వేగానికి లోనయ్యారు. చాలా రోజులు వేచి చూసేలా చేశారని.. ఇంక వెయిట్ చేసింది చాలని పేర్కొన్నాడు. అంతటితో ఆగకుండా తన చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్ మరియు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ అని మెన్షన్ చేసాడు. చివర్లో చిన్న మనవి అంటూ ఫ్యాన్స్ ఎమోషన్స్‌ తో ఆడుకోవద్దు.. ఇట్లు రెబెల్ స్టార్ ఫ్యాన్ అంటూ డై హార్డ్ ఫ్యాన్ విన్నవించుకొన్నారు. మరో అభిమాని ఈ లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఇది ప్రతి ఒక్కరి ఆవేదని అని 'రాధే శ్యామ్' మేకర్స్ ని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. మరి త్వరలో యూవీ టీమ్ ప్రమోషనల్ కంటెంట్ ని వదిలి డార్లింగ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తారేమో చూడాలి.

కాగా, ప్రభాస్ కెరీర్ లో 20వ సినిమాగా వస్తున్న ''రాధే శ్యామ్'' లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. కృష్ణం రాజు - భాగ్యశ్రీ - జగపతిబాబు - ప్రియదర్శి - సత్యరాజ్ - కునాల్ రాయ్ క‌పూర్‌ - స‌చిన్ ఖేడ్కర్‌ - ముర‌ళి శ‌ర్మ‌ - ఎయిర్ టెల్ శాషా ఛ‌త్రి - రిద్ది కుమార్‌ - స‌త్యన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్.. హిందీ వెర్షన్ కు మిథున్ మనస్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. వంశీ - ప్రమోద్ - భూషణ్ కుమార్ - ప్రశీద ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీతో పాటుగా చైనీస్ జపనీస్ వంటి విదేశీ బాషల్లోనూ ప్రభాస్ ఈ సినిమా విడుదల కానుంది.
Tags:    
  • Radheshyam 
  • Prabhas 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS