• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నేను మీకు ఓ రెబల్ స్టార్...

నేను మీకు ఓ రెబల్ స్టార్ ను ఇచ్చాను: కృష్ణంరాజు

By - Tupaki Desk
Update: 2021-12-23 16:46 GMT
ప్రభాస్ అభిమానులంతా కూడా 'రాధేశ్యామ్' సినిమా కోసం చాలా కాలంగా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ సరసన కథానాయికగా పూజ హెగ్డే అలరించనున్న ఈ సినిమా, ఒక ఖరీదైన ప్రేమకథనే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. బలమైన కథాకథనాలకు గ్రాఫిక్స్ ను జోడిస్తూ ప్రేక్షకులకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించనున్నారు. యూవీ క్రియేషన్స్ .. టి - సిరీస్ .. గోపీకృష్ణ మూవీస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చేనెల 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు. దిల్ రాజు .. నాగ్ అశ్విన్ .. సందీప్ రెడ్డి వంగా తదితర  సినీ ప్రముఖులు హాజరైన ఈ ఈవెంట్ కి, వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇక ఈ సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరించిన .. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన కృష్ణంరాజు ముందుగా వేదికపై చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం సహకరించని కారణంగా పక్కనే ప్రభాస్ ఉన్నాడు. స్టేజ్ పై నుంచే కృష్ణంరాజు అభిమానులందరినీ పలకరించారు.

కృష్ణంరాజు మాట్లాడుతూ .. "నాకు ఎంత ఆనందంగా ఉందంటే మీ అందరి దగ్గరికి పరిగెత్తుకుని రావాలనీ .. మిమ్మల్ని కలుసుకోవాలని .. కౌగిలించుకోవాలని ఉంది. మీ అందరినీ ఇలా చూసిన తరువాత నేను ఇంకా ఇలా కూర్చునే ఉన్నానంటే అదేదో శిక్ష .. భగవంతుడు ఇచ్చిన చిన్న శిక్ష .. ఓ వారం పదిరోజులలో తగ్గిపోతుంది. కాకపోతే ఈ రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని ఇలా రావలసి వచ్చింది. నేను మామూలుగా వచ్చి ఇక్కడ డాన్స్ చేసి మీతో సరదా చేయాలనుకున్నాను .. త్వరలో చేస్తా.

నేను రెబల్ స్టార్ .. రెబల్ స్టార్ ఎప్పుడూ రెబల్ గానే ఉంటాడు. లేదు అంటే రెబల్ ను ఇస్తాడు. ప్రభాస్ ను ఉద్దేశించి .. 'ఈ రెబల్ ఇంకో 50 సంవత్సరాలు మిమ్మల్ని ఆనందపరుస్తాడు" అన్నారు. హోస్ట్ గా వ్యవహరిస్తున్న నవీన్ పోలిశెట్టి కృష్ణంరాజుతో "సార్ .. మీకు డాన్స్ చేసే అవకాశం ఇస్తే ఎవరితో చేస్తారు? మూడు ఆప్షన్లు ఇస్తాను .. ఆ ముగ్గురిలో ఎవరో చెప్పాలి. జయసుధ .. జయప్రద .. పూజ హెగ్డే .. వీళ్లలో ఎవరితో డాన్స్ చేస్తారు? అని అడిగాడు. వెంటనే కృష్ణంరాజు ఎంతమాత్రం తడుముకోకుండా, 'ముగ్గురితో చేస్తాను' అన్నారు. దాంతో అక్కడి వాతావరణం మరింత సందడిగా మారిపోయింది.   
Tags:    
  • Krishnam Raju 
  • Radheshyam 
  • Prabhas 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS