కామెంట్‌: రాజమౌళికి అందుకే రాలేదు

Update: 2016-03-29 05:01 GMT
బాహుబలి: ది బిగినింగ్.. ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకోవడం తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో గర్వకారణమైన విషయమే. కానీ బాహుబలికి, అందులోని గ్రాఫిక్స్ భాగాలకు మాత్రమే అవార్డులు దక్కాయి. మరి తెలుగు సినిమా ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింప చేసే చిత్రరాజాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి మాత్రం అవార్డు రాలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులు చాలా నిరుత్సాహపడ్డారు.

జాతీయ ఉత్తమ దర్శకుడిగా బాజీరావ్ మస్తానీ చిత్రానికి గాను సంజయ్ లీలా భన్సాలీ అవార్డు గెలుచుకున్నారు. ఈ అవార్డు ప్రకటన విషయంలో ఉత్తరాది వారి పక్షపాతమే గెలిచిందనే విమర్శలు వినిపించాయి. అయితే.. అలాంటిదేమీ లేదని జ్యూరీ మెంబర్లలో ఒకరైన కౌషిక్ అంటున్నారు. రాజమౌళి - భన్సాలీలలో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై నెక్ టు నెట్ పోటీ ఏర్పడిందని... కానీ మేకింగ్ విషయంలో ఉత్తమంగా నిలిచిన బాజీరావ్ మస్తానీకి సంజయ్ లీలా భన్సాలీకే అవార్డ్ కోసం ఎంపిక చేశామని చెప్పారు కౌశిక్.

'బాహుబలి ఖచ్చితంగా చాలా గొప్ప చిత్రమే. హాలీవుడ్ స్థాయిని మన భారతీయ సినిమాలు అందుకుంటాయని  నిరూపించిన మూవీ. కానీ వివరణాత్మక సన్నివేశాల్లోను, నటుల ప్రతిభను తెరకెక్కించడంలోను, ఉద్వేగాలను రగల్చడంలోను.. బాజీరావ్ మస్తానీకే ఎక్కువ మార్కులు పడ్డాయి' ఇదే కౌషిక్ ఇచ్చిన వివరణ. అలా మన జక్కన్న ఉత్తమ దర్శకుడి అవార్డుకు దూరమయ్యాడని జ్యూరీ మెంబర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
Tags:    

Similar News