ప‌వ‌న్‌కి 'దురంధ‌ర్' ట్రీట్ 'OG' ద‌ర్శ‌కుడితోనే పాజిబుల్?

ఈరోజుల్లో ఎంపిక చేసుకునే స్క్రిప్టు, పాత్ర‌ను ఆవిష్క‌రించే విధానం క‌చ్ఛితంగా రియాలిటీకి ద‌గ్గ‌రగా ఉండాలి.;

Update: 2026-03-24 17:30 GMT

ఈరోజుల్లో ఎంపిక చేసుకునే స్క్రిప్టు, పాత్ర‌ను ఆవిష్క‌రించే విధానం క‌చ్ఛితంగా రియాలిటీకి ద‌గ్గ‌రగా ఉండాలి. సూప‌ర్ హీరో పాత్ర‌ను చూపించినా కానీ వాస్త‌వాల‌ను మెర్జ్ చేస్తూ అడ్వెంచ‌ర్లు చేయించాలి.. అలా కాకుండా నేల‌విడిచి సాము చేస్తే, పాత కాలం నాటి ఔట్ డేటెడ్ ఐడియాల‌జీతో హీరో ఎలివేష‌న్స్ ని పంచ్ డైలాగుల ప‌వ‌ర్ ని తెర‌పై చూపిస్తామంటే చూడ‌టానికి ఎవ‌రూ సిద్దంగా లేరు. ఈ విష‌య‌న్ని నిరూపించింది ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. ఓటీటీల‌లో చాలా వెబ్ సిరీస్ లు.. చాలా అనువాద చిత్రాలు హై క్లాస్ ట్రీట్ మెంట్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. ఇలాంటి స‌మ‌యంలో మారిన కాలంతో పాటే మార్పును స్వీక‌రించ‌కుండా సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఉస్తాద్ నిరూపించింద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఏది ఏమైనా ప‌వ‌ర్ స్టార్ ని నిజ‌మైన దురంధ‌రుడిగా చూపించే స‌త్తా ఓజీ ద‌ర్శ‌కుడికే ఉంది అని ఇప్పుడు అభిమానులు బ‌లంగా న‌మ్ముతున్నారు. దురంధ‌ర్ ముందు ఉస్తాద్ వెల‌వెల‌బోవ‌డంతో ఇప్పుడు ఈ చ‌ర్చ మ‌రింత వేడెక్కించేస్తోంది.

అయితే ప‌వ‌న్ సినిమాలు చేయ‌డం లేదు! అంటూనే సురేంద‌ర్ రెడ్డితో ఓ సినిమా.. చుట్టాల‌బ్బాయి నిర్మాత‌ రామ్ తాళ్లూరితో మ‌రో సినిమా చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి..ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ప‌రాజ‌యం ప్ర‌భావం త‌దుప‌రి సినిమాల‌పై లేనే లేదు. ప‌వ‌న్ గ‌త సినిమాలో ఎవ‌రితో సినిమా చేసారు? అనేది ముఖ్యం కాదు. సుజీత్ లాంటి ప్ర‌తిభావంతుడిని న‌మ్ముకుంటే ప‌వ‌న్ ని తిరిగి ట్రాక్ లోకి తేగ‌ల‌డ‌నే న‌మ్మ‌కం అభిమానుల‌కే కాదు ఇప్పుడు సాధార‌ణ‌ ప్రేక్ష‌కుల‌కు కూడా ఉంది.

ఈ సీజ‌న్ లో ఉస్తాద్ చిత్రం ప‌రాజ‌యం పాల‌వ్వ‌డానికి కార‌ణం `దురంధ‌ర్ 2` నుంచి ఎదురైన గ‌ట్టి పోటీ కూడా .. దురంధ‌ర్ గ్రాండ్ స‌క్సెస్ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లోను దురంధ‌ర్ 2పై అంచ‌నాలు ఏర్ప‌డ‌టంతో ర‌ణ్ వీర్ సినిమా ఆడుతున్న‌ థియేట‌ర్లు కిట‌కిట‌లాడుతున్నాయి.

అయితే రొటీన్ మాస్ మ‌సాలా యాక్ష‌న్, కామెడీ అంశాలు మాత్ర‌మే ఈరోజుల్లో విజ‌యానికి స‌హ‌క‌రించ‌వ‌ని ఉస్తాద్ ప్రూవ్ చేసింది. అందుకే సుజీత్ లాంటి యంగ్ డైరెక్ట‌ర్ దురంధ‌ర్ ట్రీట్ తో ప‌వన్ ని ప‌రాజ‌యం నుంచి ప‌క్క‌కు మ‌ర‌ల్చ‌గ‌ల‌డ‌ని అభిమానులు భావిస్తున్నారు. ఓజీ 2 చేయ‌డానికి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తే మిగ‌తా ప‌ని సుజీత్ చూసుకుంటాడులే! అనే ధీమా అభిమానుల‌కు ఉంది. ప‌వ‌ర్ స్టార్ స్టామినా ఎంతో సుజీత్ క‌రెక్ట్ గా ప‌ట్టుకున్నాడు. ప‌వ‌న్ ని ఇప్ప‌టివ‌ర‌కూ చూడ‌నంత కొత్త‌గా ఆవిష్క‌రించే స‌త్తా కానీ, డైన‌మిజం కానీ సుజీత్‌లో మెండుగా ఉన్నాయ‌ని అభిమానులు బ‌లంగా న‌మ్ముతున్నారు. అత‌డు రొటీనిటీకి భిన్నంగా ఏదైనా చేయ‌గ‌ల‌డు. నేటి జెన్ జెడ్ థింకింగ్ అత‌డికి పుష్క‌లంగా ఉంద‌ని ఇప్ప‌టికే ప్రూవైంది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతానికి సినిమాలేవీ చేయడం లేదు.. అని అధికారిక నోట్ రిలీజ్ చేసినా కానీ... ఓజీ 2 ఉంటే గ‌నుక‌ అధికారికంగా తెలియ‌జేస్తామ‌ని హింట్ ఇవ్వ‌డంతో అన్ని స‌స్పెన్స్ ల‌కు తెర దించేసిన‌ట్టే అయింది. మ‌రో దురంధ‌ర్ రేంజు సినిమా తీయ‌గ‌ల స‌త్తా సుజీత్ కి ఉంది. ప‌వ‌ర్ స్టార్ ని కొత్త‌గా ప్రెజెంట్ చేయ‌గ‌ల ప‌ట్టుద‌ల అత‌డికి ఉంది.. అందువ‌ల్ల ప‌వ‌న్ తో `ఓజీ` సీక్వెల్ ని మ‌రింత వైవిధ్యంగా, కొత్త‌ద‌నం నిండిన పాత్ర‌ల‌తో ప్రెజెంట్ చేస్తాడ‌నే అంతా భావిస్తున్నారు. అయితే ప‌వన్ కానీ, ఆయ‌న బృందం కానీ దీనిని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతానికి సినిమాల్లేవ్ అనేస్తున్నారు గ‌నుక కాస్త వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News