ఖుషీ కపూర్ ఫ్యాషన్ సెన్స్- స్టైల్ కి ఫిదా
బాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ ఖుషీ కపూర్ తనదైన ఫ్యాషన్ సెన్స్ - ప్రత్యేకమైన స్టైలింగ్‌తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది.
బాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ ఖుషీ కపూర్ తనదైన ఫ్యాషన్ సెన్స్ - ప్రత్యేకమైన స్టైలింగ్‌తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ `వాలెంటినో` ఇటీవల ముంబైలో నిర్వహించిన ఎక్స్‌క్లూజివ్ దీపావళి సెలబ్రేషన్స్ ఈవెంట్‌లో ఖుషీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆదిత్య రాయ్ కపూర్, డయానా పెంటి, ఫాతిమా సనా షేక్, డినో మోరియా వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో తన క్లాసిక్ మరియు మోడర్న్ గ్లామర్ కలబోతతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
గత రాత్రి జరిగిన ఈ ఫ్యాషన్ వేడుకలో ఖుషీ కపూర్ ధరించిన అవుట్‌ఫిట్ నెటిజన్లను విశేషంగా అలరిస్తోంది. ముందు భాగంలో సాటిన్ బో - షీర్ ప్యానెల్‌తో ఉన్న బ్లాక్ క్రాప్డ్ జాకెట్‌ను ఆమె ధరించారు. ఈ జాకెట్‌కు ఉన్న సాఫ్ట్ ఫెదర్ కఫ్స్ ఆమె లుక్‌కు మరింత రాయల్ టచ్ ఇచ్చాయి. దీనికి కాంబినేషన్‌గా క్రీమ్ కలర్ కాలమ్ స్కర్ట్, బ్లాక్ ఎంబెల్లిష్డ్ వాలెంటినో బ్యాగ్ - పెర్ల్ డ్రాప్ ఈకరింగ్స్‌తో ఆమె ఎంతో గ్రేస్‌ఫుల్‌గా కనిపించారు.
అంతేకాకుండా హ్యాండ్ సమ్ స్లీక్ అప్‌డో హెయిర్‌స్టైల్ - గ్లోయింగ్ మేకప్‌తో ఖుషీ కపూర్ ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయక పండుగ వాతావరణానికి ఆధునిక ఫ్యాషన్ టచ్ ఇస్తూ ఆమె ఎంచుకున్న ఈ లుక్, బాలీవుడ్ నయా ఫ్యాషన్ ఐకాన్‌గా ఆమెకున్న గుర్తింపును మరోసారి నిరూపించింది. స్టైలింగ్ విషయంలో ప్రయోగాలు చేస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆమె ఎప్పటికప్పుడు మెప్పిస్తున్నారు.
ఖుషీ కపూర్ సినీ ప్రయాణం విషయానికి వస్తే.. జోయా అక్తర్ దర్శకత్వంలో వచ్చిన `ది ఆర్చీస్` చిత్రం ద్వారా ఆమె డిజిటల్ అరంగేట్రం చేశారు. ప్రముఖ కామిక్ ఆధారంగా వచ్చిన ఈ యూత్ ఫుల్ డ్రామాలో ఖుషీ తన నటన, డాన్స్ - స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని, సినీ వర్గాల దృష్టిని ఆకర్షించడంలో ఆమె సఫలమయ్యారు.
ఇక ఖుషీ కపూర్ తదుపరి చిత్రంగా `మామ్ 2` రాబోతోంది. దివంగత శ్రీదేవి నటించిన ఐకానిక్ థ్రిల్లర్ `మామ్` చిత్రానికి ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. ఆమె తండ్రి బోనీ కపూర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం నవంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. నటిగా ఖుషీ కపూర్ కెరీర్‌లో ఈ చిత్రం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.