వీడియోలో అలా.. పోస్టులో ఇలా.. దిశా కోసమే చర్చంతా!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ తాజాగా చేసిన కొన్ని పబ్లిక్ యాక్ట్స్, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.;

Update: 2026-03-24 18:03 GMT

బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ తాజాగా చేసిన కొన్ని పబ్లిక్ యాక్ట్స్, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. గ్లామర్‌ షోలో ఆమె తీసుకుంటున్న స్టాండ్‌ పై అనేక మంది నెటిజన్లు ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వైరల్ అయిన ఎస్కలేటర్ వీడియో ఆ చర్చలకు ప్రధాన కారణంగా నిలిచింది.

ఆ వీడియోలో దిశా ఓ ఎస్కలేటర్‌ పై కనిపించారు. ఆ సమయంలో ఎవరో వీడియో తీస్తున్నారని అనుమానం వచ్చిన వెంటనే ఆమె అసిస్టెంట్ దిశాను కొంచెం తిప్పి నిలబెట్టినట్లు కనిపించింది. ఆ సమయంలో ఆమె డ్రెస్ వల్ల కనిపించే బాడీని దాచే ప్రయత్నం చేసినట్లు వీడియోలో స్పష్టంగా గమనించవచ్చు. ఆ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు.

అయితే అదే సమయంలో దిశా పటానీ తన అఫీషియల్ ఇన్‌ స్టాగ్రామ్ లో మరింత గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేయడం మరో చర్చకు దారితీసింది. ఆ ఫోటోల్లో ఆమె తన స్టైలింగ్, గ్లామర్ లుక్‌ ను క్లియర్ గా ప్రదర్శిస్తూ కనిపించింది. దీంతో పబ్లిక్‌ లో దాచే ప్రయత్నం చేస్తూ.. సోషల్ మీడియాలో మాత్రం అదే విషయాన్ని క్లియర్ గా చూపించడం ఎందుకు అనే ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట వినిపిస్తున్నాయి.

కొంతమంది అభిమానులు అయితే ఇది పూర్తిగా పర్సనల్ సెలక్షన్ అని, నటిగా ఆమెకు తన ఇమేజ్‌ ను ఎలా ప్రెజెంట్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకునే కంప్లీట్ రైట్స్ ఉన్నాయని అంటున్నారు. ఫ్యాషన్, గ్లామర్ అనేవి సినీ ఇండస్ట్రీలో సాధారణ విషయాలు అని చెబుతున్నారు. వాటి కోసం అతిగా మాట్లాడటం అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్ లో సెలబ్రిటీలు తమ బ్రాండ్‌ ను నిర్మించుకోవడానికి ఈ తరహా ఫోటోషూట్లు కామన్ అని చెబుతున్నారు.

అదే సమయంలో మరోవైపు విమర్శకులు మాత్రం భిన్నంగా రెస్పాండ్ అవుతున్నారు. పబ్లిక్ ఈవెంట్స్ లో ఒక విధంగా ప్రవర్తిస్తూ, సోషల్ మీడియాలో మరో విధంగా గ్లామర్‌ ను ప్రోత్సహించడం సరైన మెసేజ్ కాదని అంటున్నారు. ముఖ్యంగా యూత్ పై సెలబ్రిటీల ప్రభావం ఎక్కువగా ఉండే నేపథ్యంలో.. ఇలాంటి చర్యలు ఎలా అర్థం చేసుకోవాలని క్వశ్చన్ చేస్తున్నారు.

కాగా.. సోషల్ మీడియా జెనరేషన్ లో సెలబ్రిటీ ఇమేజ్ మేనేజ్మెంట్ ఎంత క్లిష్టంగా మారిందో క్లియర్ గా తెలుస్తోంది. ఒక చిన్న వీడియో లేదా ఫోటో క్షణాల్లో వైరల్ అవుతూ, విభిన్న కోణాల్లో చర్చకు దారితీస్తోంది. ఏదేమైనా.. దిశా పటానీ ఇష్యూ మరోసారి సెలబ్రిటీల పర్సనల్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇమేజ్, సోషల్ మీడియా ఎఫెక్ట్ వంటి అంశాలపై చర్చలు మళ్లీ ముందుకు తెచ్చింది. దీనిపై దిశా ఏమైనా రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి.

Tags:    

Similar News