అవంతిక రేప్.. ఇప్పుడు జాగ్రత్తపడ్డారు

Update: 2017-04-29 07:27 GMT
బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయిన కొన్ని రోజులకు ఓ వివాదం బాగా చెలరేగింది. అవంతికను.. శివుడు రేప్ చేశాడన్నది వారి అభియోగం. ప్రభాస్-తమన్నాల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ కు ముందు.. తమన్నా బట్టలను ప్రభాస్ బలవంతంగా ఊడదీయడం.. రకరకాల పసర్లతో మేకప్.. లిప్ స్టిక్ వేసేయడం.. డ్రెసింగ్ తీరు మార్చడం వంటివి చేస్తాడు.

వీటికంటే ముందు అవంతికకు తెలీకుండా పచ్చబొట్లేస్తాడు. ఆ తర్వాత పచ్చబొట్టేసినా అంటూ పాడుకుంటాడు. కానీ ఆమెకు ఇష్టం లేకుండా ఇవన్నీ చేసేయడం చూస్తాం. దీంతో అవంతికను మహేంద్ర  బాహుబలి రేప్ చేశాడనే ఆరోపణలు వినిపించాయి. దీనిపై క్లారిటీ ఇచ్చింది బాహుబలి టీం. ఇప్పుడు బాహుబలి2లో అలాంటి అవకాశం ఏదీ లేదు. తమన్నాకు నాలుగైదు ఫ్రేమ్స్ లో కనిపించడం తప్ప అసలు కేరక్టరే లేదు. మూవీ అంతా అనుష్క కనిపిస్తుంది. ఆమె పాత్రను ధీరోదాత్తంగా తీర్చిదిద్దాడు రాజమౌళి.

శివగామి పాత్రను ఎదిరించేలా ఉన్న అనుష్క రోల్ ఆకట్టుకుంటుంది. ఆమె మాత్రమే దేవసేన పాత్రకు ఎందుకు సూట్ అవుతుందనే విషయాన్ని.. తన నటనతో చూపించింది అనుష్క. మరిప్పుడు అవంతిక రేప్ అన్నవాళ్లు ఎలా స్పందిస్తారనే సంగతి ఆసక్తి కలిగించడం ఖాయం. అలాగే అవంతికపై వచ్చిన క్రిటిసిజంతోనే ఈసారి రాజమౌళి కూడా గ్లామర్ యాంగిల్ ఎవాయిడ్ చేశాడనే అనుకోవాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News