జనతా గ్యారేజ్.. పైరసీ వలన రేటింగ్స్ రాలే

Update: 2016-10-26 19:30 GMT
ఇప్పుడు ఒక హాట్ రూమర్ సినిమా లవర్స్ ను కలవరపెడుతోంది. మొన్న టివిలో ప్రసారమైన ''జనతా గ్యారేజ్'' సినిమాకు అసలు ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ టి.ఆర్.పిలు రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్టయిన జనతా గ్యారేజ్.. గతంలో కేవలం 43 కోట్లు షేర్ వసూలు చేసిన టెంపర్ టివి స్ర్కీనింగ్ రేటింగ్స్ ను కూడా దాటలేకపోయింది. అసలు ఈ రేంజులో జనతా గ్యారేజ్ టివిల్లో ఎందుకు ఫెయిలైందంటారు?

దానికి ఒక కారణంగా ఏం చెబుతున్నారంటే.. సరిగ్గా టివిలో సినిమా రావడానికి రెండు రోజుల ముందు జనతా గ్యారేజ్ సినిమా పైరసీ వెబ్ సైట్స్ లో దర్శనమిచ్చింది. కావాలనే ఎవరో ఇలా ఆన్ లైన్ లో ప్రింట్ అప్ లోడ్ చేయడం వలన.. చాలామంది టివిల్లో చూడలేదని ఒక వర్గం వాదిస్తోంది. అయితే సినిమాకు టి.ఆర్.పి.లు రాలేదు కాబట్టి ఇలా పైరసీ స్టోరీలు ప్రచారం చేస్తున్నారా అనే వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఇంటర్నెట్ లో సినిమా పైరసీ వచ్చేసినంత మాత్రాన టివిల్లో టి.ఆర్.పి రేటింగులు తగ్గిపోతాయా? సాధారణ మిడిల్ క్లాస్ ఇళ్లలో ఇప్పటికీ ఇంకా కంప్యూటర్లూ ఇంటర్నెట్ కనక్షన్లూ లేవు. వారందరూ ఖచ్చితంగా టివిలపైనే ఆధారపడతారు. అలాంటప్పుడు ఆన్ లైన్ లో ఒకరోజు ముందు సినిమా లీక్  అవ్వబట్టి టివిలో టి.ఆర్.పి.లు రాలేదు అని ఎలా చెబుతాం అంటున్నారు కొందరు.  

ఇంకోవైపు అసలు టివిలో సినిమాను వేసినప్పుడు భారీ యాడ్స్ తో బాహుబలి రేంజులో బోర్ కొట్టించారు సదరు ఛానల్ వారు. కాని అన్నేసి యాడ్లు వేసినా జనాలు బాహుబలిని చూశారు కాని.. జనతా గ్యారేజ్ విషయంలో మాత్రం వారికి కోపం వచ్చి ఉంటుంది. అందుకే టి.ఆర్.పి.లు బాగా తగ్గిపోయాయ్ అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.

ఏదేమైనప్పటికీ.. మొన్నటివరకు ఎక్కడా కనిపించని జనతా గ్యారేజ్ పైరసీ ప్రింట్లు.. ఇప్పుడు ఆన్ లైన్ లో దర్శనమిస్తున్నాయి. ఒక ప్రింట్ అయితే ఏకంగా టివి ఛానల్ లో వేసిన సినిమాను రికార్డు చేసి పెట్టేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News