నాని లోకల్.. ఎందుకు ఆగిందో తెలుసా?

Update: 2017-01-21 10:08 GMT
గతేడాది హీరో నాని తెగ స్పీడుగా సినిమాలు చేసేశాడు. మొదటగా కృష్ణగాడి వీర ప్రేమగాధతో మొదలుపెట్టి.. ఆ తర్వాత సమ్మర్ లో జెంటిల్మన్ అంటూ సూపర్ హిట్ కొట్టేశాడు. ఆ తర్వాత వచ్చిన మజ్ను.. ముందరి సినిమాల అంత కాకపోయినా.. బాగానే ఆడింది. నాని స్టామినా చూపించింది. వీటితో పాటు డిసెంబర్ చివర్లో సంక్రాంతి సీజన్ కి 'నేను లోకల్'ని రిలీజ్ చేస్తామని పక్కాగా చెప్పాడు నాని.

అయితే.. అనుకోని విధంగా నేను లోకల్ వాయిదా పడిపోయింది. ఫిబ్రవరి 3న రిలీజ్ కి రెడీ అయింది. కానీ నేచురల్ స్టార్ మూవీ వాయిదా పడ్డానికి అసలు కారణం ఏంటో మాత్రం ఇప్పటివరకూ తెలియలేదు కానీ.. ఇప్పుడు అసలు విషయం బైటకొచ్చేసింది. డిసెంబర్ రిలీజ్ టార్గెట్ తో చాలా ఫాస్ట్ గా సినిమాను పూర్తి చేశారు. కానీ క్లైమాక్స్ విషయంలో మాత్రం నానికి ఏమాత్రం నచ్చలేదట. మళ్లీ రాయమని చెప్పాడట హీరో.  అదే విషయాన్ని సినిమా చూపిస్త మామ వంటి చిత్రానికి డైలాగ్స్ రాసిన రైటర్ ప్రసన్న కుమార్ కు చెబితే.. తన సైడ్ నుంచి నో అనడమే కాదు.. అదే కరెక్ట్ అని కాన్ఫిడెంట్ గా చెప్పాడట.

ఆ సమయంలో నిర్మాత దిల్ రాజు కూడా రైటర్ వైపే మొగ్గినా.. ప్రసన్న కుమార్ రైటింగ్ లో వచ్చిన నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ చిత్రం రిజల్ట్ తేడా రావడంతో.. నాని చెప్పినట్లుగా క్లైమాక్స్ ను రీ-రైట్ చేయక తప్పలేదు. అలా క్లైమాక్స్ ను నాని చెప్పినట్లుగా మార్చక తప్పదని అర్ధమయ్యాక రిలీజ్ పోస్ట్ పోన్ చేయడం ప్రకటించారు. అలా ఇప్పటికి నేను లోకల్ రిలీజ్ కి సిద్ధమైందన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News