• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్విన్స్ సినిమా కోసం...

ట్విన్స్ సినిమా కోసం కొత్త ప్రచారం

By - Tupaki Desk
Update: 2017-06-30 09:20 GMT
సినిమా నిర్మించడం ఒకలాంటి నిత్య కురుక్షేత్రం అయితే.. సినిమాను ప్రచారం చేయడం మరోక పద్మవ్యూహం అనే చెప్పాలి. సినిమా ఎలాంటిదైనా ఎంతటి వారు నటించినా ప్రచారం సరిగాలేకపోయినా చేరవలిసిన తెలపవలిసిన సినిమా విశేషాలు ప్రేక్షకులుకు చెప్పకపోయినా అది సినిమా ఫలితం పై గట్టిగానే ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి  వాటిలో బాలీవుడ్ కొంచెం  మనకన్నా ముందుంది అనే చెప్పాలి. ముఖ్యంగా షారూక్ ఖాన్ - అమీర్ ఖాన్ వాళ్ళ సినిమాను ప్రోమోట్ చేసే విధానం చాలా  కొత్తగా సినిమాకు అవసరమైన విదంగా ఉంటుంది.

షారూక్ ఖాన్ కొత్త సినిమా ‘జబ్ హ్యారి మెట్ సేజల్’ కోసం ఒక కొత్త పంధాలో మార్కెటింగ్ చేశాడు. ఆ సినిమాలో సేజల్ అనేది హీరోయిన్ పేరు. ఆమె కోసం హీరో వెతుకుతాడు లేదా కలుస్తాడు. అందుకని ప్రముఖ సిటీలలో సేజల్ అనే పేరు ఉన్న అమ్మాయిలను లిస్ట్ చేసి ఏ సిటీలో అయితే ఎక్కవ సేజల్  పేరు గల వారు ఉంటారో అక్కడికి వెళ్ళి ఆ సినిమాలోని ‘రాధ’ పాట ను విడుదల చేయించాడు. దీన్ని వలన ఈ సినిమా ఏంటో అందరికీ బాగా అర్ధం అయ్యింది. ఎటువంటి స్టైల్ లో ఉండబోతుందో ముందే ఒక అంచనకు వచ్చారు ప్రేక్షకులు. ఇప్పుడు అలాగే మరో యంగ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న ‘జుడ్వా2’ ట్రైలర్ను కవలలుచే విడుదల చేయిస్తున్నారట. ఎందుకంటే మూవీలో వరుణ్‌ ధావన్‌ ద్విపాత్రాభినయంలో ట్విన్స్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా 1997లో సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘జుడ్వా’ చిత్రానికి సీక్వెల్‌ గా రాబోతోంది.. అదేనండీ మన హలోబ్రదర్ రీమేక్ కి సీక్వెల్.

దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న కవలలని కలుసుకొని వాళ్ళ సమక్షంలో ట్రైలర్ ను విడుదల చేసే పనిలో ఉన్నారు టీమ్. మొత్తానికి ప్రచారం కోసం ఎన్నిదారులు ఉంటే అన్నీ దారులలోనూ వెళ్ళి సినిమా విజయవంతం చేయాలని చూస్తున్నారనమాట. ఈ సినిమాలో వరుణ్‌కి జోడీగా జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌, తాప్సీ నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 29న ఈ చిత్రం విడుదల కాబోతోంది. డేవిడ్‌ ధావన్‌ దర్శకుడు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Real life twins 
  • Varun Dhawan 
  • Judwaa 2 Trailer 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS