• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంకా లేట్ చేస్తే ఫ్యాన్...

ఇంకా లేట్ చేస్తే ఫ్యాన్ మేడ్ మూవీ రెడీ చేసేలా ఉన్నారు రాధే శ్యామా..!

By - Tupaki Desk
Update: 2021-06-08 18:30 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీ ''రాధే శ్యామ్''. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1960ల నాటి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణగా పుజా హెగ్డే నటిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి రెగ్యులర్ గా అప్డేట్స్ రాకపోవడంపై డార్లింగ్ నిరాశ చెందుతున్నారు.

'రాధే శ్యామ్' సినిమా సెట్స్ పైకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది. అయినా ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ - ఫెస్టివల్ పోస్టర్స్ - గ్లిమ్స్ తప్ప వేరే ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయలేదు. అవి కూడా నెటిజన్ల ట్రోల్స్ ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో టీజర్ అయినా రిలీజ్ చేయాలని ఆ మధ్య ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ చేసారు. ఒకానొక దశలో సహనం కోల్పోయి నిర్మాతలను నిద్ర లేవండంటూ నెగెటివ్ ట్రెండ్ చేశారు.

అయినా సరే 'రాధే శ్యామ్' నుంచి అప్డేట్స్ రాకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ స్పెషల్ పోస్టర్స్ ని డిజైన్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి 'రాధే శ్యామ్' మీద డిజైన్ చేసినన్ని ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ - టీజర్స్ మరే సినిమా మీద లేవనే చెప్పాలి. తాజాగా సరికొత్త ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి వైరల్ అవుతోంది. ప్రభాస్ - పూజా లకు సంబంధించిన ఈ రొమాంటిక్ పోస్టర్ బ్యూటిఫుల్ గా ఉండటమే కాకుండా.. అఫిషియల్ పోస్టర్ ని తలపిస్తోంది.

'రాధే శ్యామ్' అఫీసియల్ అప్డేట్స్ వచ్చే వరకు ఇలా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తోనే సందడి చేస్తుంటామని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. ఇప్పటినుంచైనా టీజర్ - సాంగ్స్ - ట్రైలర్ అంటూ హంగామా చేయకపోతే ఫ్యాన్ మేడ్ మూవీ కూడా రెడీ చేసేలా ఉన్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిత్ర బృందం త్వరలోనే వారిని ఖుషీ అప్డేట్ తో వస్తుందేమో చూడాలి.

కాగా, కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ - గోపీకృష్ణ బ్యానర్స్ పై వంశీ - ప్రమోద్‌ - ప్రసీద 'రాధే శ్యామ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని సమాచారం. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన వెంటనే తిరిగి చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్స్ ఇవ్వడానికి ముందుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Tags:    
  • Radheshyam 
  • Prabhas 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS