గ్యాంగ్ స్ట‌ర్ క‌థ‌ని వ‌దులుకున్న‌ మాస్ రాజా?

Update: 2021-05-17 04:30 GMT
ధనుష్ న‌టించిన `వ‌డ చెన్నై` క్రిటిక్స్ ప్ర‌శంస‌ల‌తో పాటు ఆడియెన్ ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. 2018 లో రిలీజైన ఈ క్రైమ్ డ్రామా లో కీలక పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరో రవితేజను జాతీయ అవార్డు గ్రహీత తమిళ దర్శకుడు వేట్రిమారన్ సంప్రదించార‌ట‌. క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తో జరిగిన తాజా సోషల్ మీడియా సంభాషణలో ఈ విష‌యాన్ని వేట్రిమారన్ స్వయంగా వెల్లడించారు.

తాను మొదట వాడ చెన్నై స్క్రిప్ట్ ను విజయ్ సేతుపతికి వివరించానని ఈ చిత్రంలో నార్త్ మద్రాస్ స్మగ్లర్ రాజన్ పాత్రను పోషించమని కోరినట్లు వెట్రిమారన్ చెప్పాడు. స్క్రిప్ట్ స‌హా త‌న‌ పాత్ర న‌చ్చినా కానీ.. ప్యాక్డ్ షెడ్యూల్ కారణంగా వ‌దులుకున్నార‌ట‌. ఆ త‌ర్వాత పాండిచేరిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు వెట్రిమారన్ ఈ కథను మాస్ మహారాజాకు వివరించాడు. రవితేజ కూడా స్క్రిప్ట్ కి ఫిదా అయిపోయారు. కానీ అతను తన బిజీ షెడ్యూల్ కారణంగా వెట్రీ ఆఫర్ ను అంగీకరించడంలో తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు.

ఆ తరువాత వెట్రీ ఈ పాత్ర కోసం ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అమీర్ సుల్తాన్ ను సంప్రదించాడు. అత‌డు స్క్రిప్ట్ పూర్తిగా వినాల్సిన ప‌నే లేకుండా సినిమాకు సంతకం చేశాడు. `వ‌డ చెన్నై` విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డమే గాక బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. కానీ ర‌వితేజ ఒక మంచి పాత్ర‌ను వ‌దులుకున్నారు.
Tags:    

Similar News