మాస్ మహరాజ్ ముహూర్తం ఫిక్స్!!

Update: 2016-09-27 15:30 GMT
మాస్ మహరాజ్ రవితేజ ఇప్పటికి 10 నెలలుగా ఖాళీగానే ఉన్నాడు. బెంగాల్ టైగర్ తో సక్సెస్ చవి చూసినా.. నెక్ట్స్ ప్రాజెక్ట్ మాత్రం డిలే అవుతూనే ఉంది. రకరకాల కారణాలతో పలు ప్రాజెక్టులు ప్రారంభానికి ముందే ఆగిపోయాయి. రీసెంట్ గా తనతో పవర్ మూవీని తీసిన దర్శకుడు బాబీతో.. మాస్ మహరాజ్ ఓ సినిమా ఓకే చేశాడు. ఇప్పుడీ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఖాయమైంది.

రవితేజకి పవర్ మూవీ ఇచ్చి మెప్పించిన బాబీ.. ఆ తర్వాత పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత మీడియాకి కనబడ్డానికి మొహం చాటేసిన ఈ దర్శకుడు.. మాస్ మహరాజ్ ని మాత్రం మెప్పించగలిగాడు. కొంత కాలంగా ఈ ప్రాజెక్టు పైనే వర్క్ చేసిన బాబీ.. ఇప్పుడు ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవడంతో.. షూటింగ్ ప్రారంభానికి సిద్ధమైపోయాడు. దసరా పండుగ రోజున శుభ ముహూర్తం చూసుకుని.. మహూర్తం షాట్ తీయనున్నారట రవితేజ-బాబీ.

వీరిద్దరి ప్రాజెక్టు గురించి మరికొన్ని రోజుల్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉండగా.. ఇతర పాత్రల ఎంపికపై కూడా చకచకా పనులు నడుస్తున్నాయి. ప్రీప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయిపోయినట్లు టాక్. మళ్లీ మాస్ రాజ్ కెమేరా ముందుకొచ్చే ముహూర్తం దగ్గరయిపోతున్నట్లే.

Tags:    

Similar News