• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రవితేజ ఒప్పేసుకున్నాడు.....

రవితేజ ఒప్పేసుకున్నాడు.. తేడా వచ్చిందని?

By - Tupaki Desk
Update: 2015-08-19 19:49 GMT
రవితేజ చాలా ఈజీ గోయింగ్ అన్న సంగతి తెలిసిందే. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అతడు నిర్మాతల హీరో అంటారు ఇండస్ట్రీలో. కానీ ఈ మధ్య మాస్ రాజాతో నిర్మాతలకు పేచీ వచ్చేస్తోందన్న వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. ‘బలుపు’ సినిమా విషయంలో పొట్లూరి వరప్రసాద్ తో రెమ్యూనరేషన్ దగ్గర తేడా వచ్చిందన్నారు. పవర్ సినిమాకు సంబంధించి రాక్ లైన్ వెంకటేష్ బడ్జెట్ గురించి గగ్గోలు పెడితే రవితేజ కొంతవరకు సొంతంగా ఖర్చు  పెట్టుకున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా కళ్యాణ్ రామ్ తోనూ గొడవ జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి కొన్ని రోజుల నుంచి. కిక్-2 ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో ఇద్దరూ దూరం దూరం ఉండటం ఈ అనుమానాలకు బలాన్నిచ్చింది.

ఐతే నిర్మాతలతో పేచీ సంగతి రవితేజ దగ్గర ప్రస్తావిస్తే.. అతను ఏమీ లేదని కొట్టిపారేయలేదు. ఒకరిద్దరితో తనకు తేడా వచ్చిన మాట వాస్తవమే అని చెప్పాడు. తనకే కాదని.. ఏ హీరోకైనా ఏదో ఒక సందర్భంలో నిర్మాతతో పేచీ రావడం సహజమే అని.. అలాగని అందరితోనూ తాను గొడవ పడుతున్నాననుకోవడం అపోహే అని మాస్ రాజా స్పష్టం చేశాడు. కళ్యాణ్ రామ్ తో విభేదాలున్నాయా అంటే మాత్రం.. అదేమీ లేదని.. తామిద్దరం చాలా హ్యాపీగా పని చేసుకున్నామని మాస్ రాజా చెప్పాడు. ఐతే తనకు ఎవరితో పేచీ వచ్చిందన్న సంగతి మాత్రం చెప్పడానికి ఇష్టపడలేదు. కళ్యాణ్ రామ్ తో తేడా వచ్చిందో లేదో కానీ.. ‘కిక్-2’ సినిమాను చాలా బాగా ప్రమోట్ చేస్తూ తన  నిర్మాతకు బాగా సాయపడుతున్నాడు మాస్ రాజా.
Tags:    
  • Raviteja 
  • Tollywood Producers 
  • telugu News 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS