ర‌వితేజ బలుపు చూసేందుకు రెడీనా?

Update: 2016-05-18 09:30 GMT
ర‌వితేజ న‌టించిన బలుపు సినిమాని ఎప్పుడో చూసేశాంగా... ఇక ఇప్పుడు కొత్త‌గా చూడ‌ట‌మేంటి అంటారా?  మేం చెబుతుంది సినిమా బ‌లుపు గురించి కాదండీ, నిజ‌మైన బ‌లుపు గురించి. అంటే ఒళ్లు చేసిన కొత్త ర‌వితేజ‌ని చూసేందుకు మీరు రెడీనేనా? అనేది మా కాన్సెప్టు. కిక్‌2 - బెంగాల్ టైగ‌ర్ సినిమాల్లో ర‌వితేజ బాగా పీల‌గా క‌నిపించాడు. స్వ‌త‌హాగా ఆయ‌నో  ఫిట్ నెస్ ఫ్రీక్ కాబ‌ట్టి మ‌రింత నాజూగ్గా క‌నిపించాల‌ని ఆమ‌ధ్య క‌స‌ర‌త్తులు చేసి స‌న్న‌బ‌డ్డాడు. కిక్‌2 సినిమాలో అయితే మ‌రీ టూ మ‌చ్ స‌న్న‌గా క‌నిపించాడు. తెర‌పై ఆయ‌న క‌నిపించిన విధానం చూసి  ఫ్యాన్స్ అంతా హ‌ర్ట‌య్యారు. మ‌రీ ఇంత స‌న్న‌గానా? అని పెద‌వి విరిచారు. 

ఆ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకొని ర‌వితేజ త‌దుప‌రి సినిమాల్లో ఎప్ప‌ట్లా కాస్త బొద్దుగా క‌నిపించాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఆ మేర‌కు  ఇప్ప‌టికే ప‌ది కిలోల బ‌రువు కూడా పెరిగిన‌ట్టు స‌మాచారం. స్పెసిఫిక్‌ గా సినిమా కోసం కాక‌పోయినా  కొంత కాలం క్రితం సిక్స్ ప్యాక్ బాడీని చేసేశాడు ర‌వితేజ. దాంతోపాటు కాస్త ఒళ్లు చేసి త‌దుప‌రి సినిమాలో క‌నిపించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ఆ లుక్ మాత్రం అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంద‌ని ర‌వితేజ స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

ప్ర‌స్తుతం చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో రాబిన్‌ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు ర‌వితేజ‌. అందులో రాశిఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. షూటింగ్ కూడా షురూ అయిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.
Tags:    

Similar News