ఒక్క హిట్ తో ఇంత జోరు ఏంటి రాజా!
సినిమా ఇండస్ట్రీలో బండ్లు ఓడలు.. ఓడలు బండ్ల అవ్వడం అనేది కళ్ల ముందు చూస్తూ ఉంటాం. స్టార్ హీరోలుగా దూసుకు పోతున్న వారు.. సక్సెస్ పుల్ దర్శకులుగా దూసుకు పోతున్న వారు ఒక్క సినిమా ప్లాప్ పడటంతో చతికిల్ల పడతారు. అదృష్టం ఉంటే లేస్తారు.. లేదంటే మెల్ల మెల్లగా కనుమరుగవుతారు. అలా ఎంతో మందిని టాలీవుడ్ ప్రేక్షకులు చూశారు అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో సక్సెస్ ల కోసం ప్రాకులాడుతూ ఉంటారు. అయితే ప్లాప్ పడ్డ సమయంలో వారి ఆఫర్లు ఖచ్చితంగా తగ్గుతాయి. కాని అదృష్టం బాగుంటే మళ్లీ సక్సెస్ పడి ట్రాక్ లో పడ్డ వారు కూడా కొందరు ఉంటారు. తాజాగా రవితేజ కెరీర్ ను చూస్తుంటే నిజంగా మాస్ రాజా ఎంత లక్కీ అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఆ మద్య రెండు మూడు సంవత్సరాల పాటు రవితేజకు సక్సెస్ లు లేవు. అయినా కూడా రవితేజ పట్టు వదలని విక్రమార్కుడి తరహాలో సినిమాలు చేసి సక్సెస్ ను దక్కించుకున్నాడు. రవితేజ ఈ ఏడాది క్రాక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కరోనా తర్వాత మొదటి సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రవితేజ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే రవితేజ ఖిలాడి సినిమాను చేశాడు. ఆ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మరో వైపు రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా ను కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు విడుదల కాకుండానే ధమాకా అనే సినిమా ను త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ప్రకటించాడు. అంటే మొత్తంగా రవితేజ మూడు సినిమాలు అధికారికంగా ప్రకటించి ఉన్నాయి. అవి వివిధ దశలో ఉన్నాయి. ఈ సమయంలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో ఒక సినిమాను కూడా రవితేజ చేయబోతున్నాడు.. ఆ విషయమై అధికారిక ప్రకటన వచ్చింది.
రవితేజ 71వ సినిమా గా రూపొందబోతున్న ఆ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరో వైపు రవితేజ ఈ సినిమా కు గాను ఏకంగా 17.5 కోట్ల రూపాయల పారితోషికంను అందుకుంటున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. క్రాక్ సినిమా కు మరియు అంతకు ముందు చేసిన సినిమాల పారితోషికంకు ఈ పారితోషికం చాలా చాలా ఎక్కువ. ఒక్క క్రాక్ సినిమా సక్సెస్ తో రవితేజ జోరు మామూలుగా పెరగలేదు. అద్బుతమైన ఈ జోరును కంటిన్యూ చేస్తూ ఈ నాలుగు సినిమాల్లో కనీసం రెండు మూడు సినిమాలు సక్సెస్ అయితే పాతిక కోట్ల వరకు ఈయన పారితోషికం పెరిగిన ఆశ్చర్యం లేదు అనిపిస్తుంది. మొత్తానికి ఈ సమయం రవితేజ ఫ్యాన్స్ ను ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే.