• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బింబిసార మొదట 'క్రాక్‌'...

బింబిసార మొదట 'క్రాక్‌' స్టార్‌ వద్దకు వెళ్లాడా?

By - Tupaki Desk
Update: 2022-07-24 05:09 GMT
నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా మల్లిడి వేణు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బింబిసార'. ఈ సినిమా లో నందమూరి కళ్యాణ్ రామ్‌ రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడు. రెండు కాలాల నడుమ సాగే ఒక సోషియో ఫాంటసీ సినిమా గా ఉండబోతుందని ట్రైలర్‌ ను చూస్తుంటే అనిపిస్తుంది.

మొన్నటి వరకు పెద్దగా ఆసక్తి అంచనాలు లేని బింబిసార పై ట్రైలర్ విడుదల అయిన వెంటనే అంచనాలు అమాంతం పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ను తీశాం.. చేశాం అంటూ హీరో మరియు దర్శకుడు చాలా బలంగా చెబుతున్నారు. హీరో గా నందమూరి కళ్యాణ్ రామ్‌ కు ఈ సినిమా అత్యంత కీలకం కనుక ప్రమోషన్స్‌ ను కూడా చాలా యాక్టివ్‌ గా చేయబోతున్నారు.

ఆగస్టు 5వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. ఈ సందర్భంగా తెలిసిన విషయం ఏంటి అంటే మొదట ఈ కథతో దర్శకుడు మల్లిడి వేణు ఇద్దరు ముగ్గురు హీరోల వద్దకు వెళ్లాడట. అందులో రవితేజ కూడా ఉన్నాడని తెలుస్తోంది.

రవితేజ అప్పుడు ఉన్న బిజీ మరియు ఇతర కారణాల వల్ల బింబిసార స్క్రిప్ట్‌ ను కాదన్నాడని వార్తలు వస్తున్నాయి. బింబిసార కథ మాత్రమే కాకుండా మరో కథను కూడా రవితేజ కు మల్లిడి వేణు వినిపించాడట. ఆ కథకు కూడా రవితేజ నో చెప్పాడట. మరి కొందరు హీరోలతో కూడా సినిమాలకు మల్లిడి వేణు ప్రయత్నించి చివరకు కళ్యాణ్ రామ్‌ ను బింబిసార సినిమా తో ఒప్పించాడు.

బింబిసార సినిమా తో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకుంటాననే నమ్మకంతో కనిపిస్తున్నాడు. ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్‌ సినిమాలు అంటే రిస్క్‌. అయినా కూడా సినిమా పై ఉన్న నమ్మకం.. స్క్రిప్ట్‌ పై ఉన్న నమ్మకంతో కళ్యాణ్ రామ్‌ దాదాపుగా రూ.40 కోట్లు ఖర్చు చేశాడని అంటున్నారు.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. అతి త్వరలో మరింత జోరు పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో పాటు పలువురు స్టార్స్ ను బింబిసార ప్రమోషన్స్ కు దించేందుకు కళ్యాణ్ రామ్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా పై ఉన్న ఆసక్తి నేపథ్యంలో మంచి బిజినెస్ జరుగుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. క్రాక్‌ స్టార్‌ రవితేజ వదులుకున్న బింబిసార ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి.
Tags:    
  • Ravi Teja 
  • Kalyan Ram 
  • Bimbisara 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS