• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్‌ బాస్‌: చేదు...

బిగ్‌ బాస్‌: చేదు ల‌డ్డు... తీపి ల‌డ్డూ

By - Tupaki Desk
Update: 2019-09-30 05:35 GMT
బిగ్‌ బాస్‌ లో అంతా అనుకున్నట్లుగానే ఈ వారం రవి ఎలిమినేషన్ అయ్యాడు. ఎలిమినేషన్ జోన్ లో ఈ వారం వరుణ్ - బాబా భాస్కర్ - శ్రీముఖి - రవి ఉన్న విషయం తెలిసిందే. అయితే శనివారం వరుణ్ సేవ్ అయినట్లు ప్రకటించిన నాగార్జున - ఆదివారం ఎపిసోడ్ లో మొదట శ్రీముఖిని సేవ్ చేశారు. చివరికి బాబా భాస్కర్ - రవి ఎలిమినేషన్ జోన్‌ లో ఉండగా - రవి బిగ్ బాస్ షో నుంచి తన ఇంటికెళ్ళేందుకు విజయవాడ బస్ టికెట్ బుక్ చేసి అది చూపించి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో బాబా సేఫ్ అయినట్లు ప్రకటించారు.

ఇక రవి ఎలిమినేట్ కావడంతో అలీ - శివజ్యోతి - బాబా భాస్కర్ బాగా ఎమోషనల్ అయ్యారు. అలాగే ఇంటి నుంచి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన రవి చేత నాగ్ ఓ టాస్క్ ఆడించారు. చేదు-తీపి పేరిట ఇచ్చిన ఆ టాస్క్ లో ఇంటిలో ఉన్న 9 మంది సభ్యులకు 1 నుంచి 9 నెంబర్లలో ఒక నెంబర్ కేటాయించాలి. అందులో 1 నుంచి 5 నెంబర్లు వచ్చే వారు తీపి లడ్డులు తినాలి. 6 నుంచి 9 వచ్చే వారు చేదు లడ్డులు తినాలి.

మొదట రవి 9 నుంచి మొదలు పెట్టాడు. 9 నెంబర్లో పునర్నవి ఫోటో పెట్టి - ఎందుకు పెట్టాడో కారణాలు చెప్పాడు. దీంతో పున్నూ 9 చేదు లడ్డులు తింది. పున్ను తాను ఇది ఊహించాన‌ని కూడా చెప్పింది. నెక్స్ట్ వితికా 8 - మహేశ్ 7 - రాహుల్ 6 పెట్టాడు. వీరు నలుగురు చేదు లడ్డులు తిన్నారు. తర్వాత బాబా భాస్కర్ 5 - శ్రీముఖి 4 - వరుణ్ 3 - అలీ 2 - శివజ్యోతి 1 పెట్టాడు. ఈ ఐదుగురు తీపి లడ్డులు తిన్నారు. ఇక చివరికి రవి వెళ్ళేపోయే ముందు బిగ్ బాంబ్ పునర్నవి మీద వేశాడు.  దీని ప్రకారం బిగ్ బాస్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇంటి లోని మిగతా సభ్యులంద‌రి బట్టలు ఉతకాలి.
Tags:    
  • Biggboss 
  • Ravi 
  • Biggboss Ravi Eliminated 
  • StarMaa 
  • Nagarjuna 
  • Biggboss Telugu 
  • Biggboss Telugu 3 

Similar News

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

Copyright @2026

Powered by Blink CMS