రావణాసురా రవితేజ సూపర్ కాన్ఫిడెన్స్..!

Update: 2023-03-29 11:01 GMT
ధమాకాతో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహరాజ్ రవితేజ మరో వారంలో రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీం వర్క్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయెల్, మేఘా ఆకాష్ హీరోయిన్స్ గా నటించారు. ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా మాస్ ఆడియన్స్ కు మరోసారి ఫుల్ మీల్స్ ఇచ్చేలా ఉంది ఈ మూవీ.

రావణాసుర సినిమాపై రవితేజ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది. అలా ఎందుకు అంటే సుధీర్ వర్మ కథ చెప్పినప్పుడే సినిమా వర్క్ అవుట్ అవుతుందని అనుకున్నారట. అందుకే రవితేజ ఈ సినిమా నిర్మాణంలో భాగం కూడా అయ్యారు. ఇక ట్రైలర్ చూశాక సినిమా పక్కా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందని అనిపిస్తుంది. తన సినిమా రిలీజ్ ముందే సినిమా అవుట్ పుట్ చూసి హిట్టా కాదా అని పక్కా తేల్చేసే రవితేజ రావణాసుర విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారట. అందుకే సినిమాను భారీగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ రవితేజతో చేసిన ఈ రావణాసుర ట్రైలర్ లో కథ పెద్దగా రివీల్ చేయకపోయినా సినిమా మాత్రం మాస్ ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని మాత్రం చెప్పొచ్చు. ధమాకా హిట్ జోరులో రావణాసురతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు రవితేజ.

ఈ సినిమా తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వర రావు చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రాబోతున్న ఈ సినిమాలో రవితేజ ఇదివరకు ఎప్పుడూ కనిపించని విధంగా క్రేజీ లుక్స్ తో కనిపిస్తారని తెలుస్తుంది. రావణాసుర తర్వాత టైగర్ నాగేశ్వర్ రావునే ఫ్యాన్స్ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు రవితేజ.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News