విజ‌య్ X ర‌ష్మిక‌: పొగ వ‌స్తే చాలు నిప్పు పెట్టేస్తారు!

Update: 2022-10-09 08:31 GMT
మోడ్ర‌న్ డేస్ అభిమానులు చాలా షార్ప్! ఏ విష‌యాన్ని అయినా ఇట్టే ప‌సిగ‌ట్టేస్తారు. పొగ వ‌స్తే చాలు నిప్పు పెట్టేస్తారు! అమ్మాయి అబ్బాయి మ‌ధ్య ఏ చిన్న క్లూ దొరికినా ఇక అంతే సంగ‌తి. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో జ‌రిగిపోతోందంటూ ర‌క‌ర‌కాల పుకార్ల‌ను పుట్టించేస్తుంటారు.

టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ర‌ష్మిక మంద‌న డేటింగ్ లో ఉందంటూ చాలా కాలంగా ప్ర‌చారం ఉంది. అయితే ఆ ఇద్ద‌రూ దానిని చాలా సార్లు ఖండించారు. మేం ఇద్ద‌రం మంచి స్నేహితులం మాత్ర‌మేన‌ని తెలిపారు. కానీ అంత‌కుమించి ఇంకేదో జ‌రుగుతోందని అభిమానులు భావిస్తున్నారు. అక్టోబరు 7న రష్మిక మందన్న -విజయ్ దేవరకొండ ముంబై విమానాశ్రయం నుండి కొంత గ్యాప్ లో ఎవ‌రి మార్గంలో వారు వెళుతూ ఒక చోట క‌లిసిన‌ట్టు గుర్తించారు.

ఆ చోటు ఏది? అంటే.. హాట్ క‌పుల్స్ ఫేవ‌రెట్ డెస్టినేష‌న్ ప్లేస్ అయిన  మాల్దీవుల్లో జ‌త కుదిరింద‌ని.. ఆ ఇద్ద‌రూ ఒంట‌రి దీవుల‌కు విహారయాత్రకు వెళుతున్నార‌ని పుకార్లు వ్యాపించాయి. ఇది టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. విమానాశ్రయంలో వారిద్దరూ విడివిడిగా క‌నిపించినా ఈ సరదా సెలవులో ఇద్దరూ కలిసి విహాయ‌రాత్ర‌లో ఉన్నారని  గుస‌గుస‌లు వైర‌ల్ అయిపోతున్నాయి. ద్వీప దేశంలో రష్మికతో పాటు విజ‌య్ సెల‌బ్రేష‌న్ మూడ్ లో ఉన్నాడ‌ని అభిమానులు ఊహాగానాలు సాగిస్తున్నారు.

అందుకు తాజాగా ఒక ప్రూఫ్ కూడా ప‌ట్టేసారు. రష్మిక మాల్దీవులలో సన్ గ్లాసెస్ ధరించి స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చున్న ఓ ఫోటో అభిమానులకు రుజువుగా మారింది. విమానాశ్రయంలో విజయ్ అదే సన్ గ్లాసెస్ ధరించి కనిపించాడు. ఇప్పుడు రష్మిక అవే షేడ్స్ ఉన్న గ్లాసెస్ ని ధరించడంతో అభిమానులు వెంట‌నే ప‌సిగ‌ట్టేసారు.

ఆ ఇద్ద‌రి గుట్టూ చిక్కింది ఇక‌. జంట‌గా స్టాట‌స్ మార్చాల్సిందేనంటూ ప‌ట్టుబ‌డుతున్నారు. నిజాన్ని అంగీక‌రించాల్సిందేన‌ని కూడా కొంద‌రు నెటిజ‌నులు సామాజిక మాధ్య‌మాల్లో కోరుతున్నారు. ఇన్నాళ్లు తమ రిలేషన్ షిప్ స్టేటస్ ను దాచిపెట్టిన ఈ జంట ఇప్పుడు అభిమానుల కోసం.. మీడియా కోసం హింట్ ఇచ్చార‌ని భావించాల్సొస్తోంది. ప్ర‌స్తుతం #Virosh అనేది విజయ్ - రష్మిక కోసం అభిమానులు ఉపయోగిస్తున్న హ్యాష్‌ట్యాగ్. జంట ప్రేమాయ‌ణంపై ఫ్యాన్స్ ఉల్లాసంగా ఉన్నారు. ఇక‌పై ఆ ఇద్ద‌రూ మంచి స్నేహితులు మాత్రమే అని చెబితే కుద‌ర‌ద‌నేస్తున్నారు.

మాల్దీవుల పర్యటన తర్వాత అధికారికంగాఏదైనా ప్రకటిస్తారా లేదా అనేది చూడాలి. ఇక‌పోతే ర‌ష్మిక మంద‌న బాలీవుడ్ లో కెరీర్ ప‌రంగా బిజీబిజీగా ఉంది. ఇటీవ‌లే లైగ‌ర్ తో హిందీ ప‌రిశ్ర‌మ‌లో స‌త్తా చాటాల‌నుకున్న దేవ‌ర‌కొండ నెగెటివ్ రిజ‌ల్ట్ తో నిరాశ‌ప‌డ్డాడు. కానీ త‌దుప‌రి పూరితో జ‌న‌గ‌న‌మ‌ణ కోసం స‌న్నాహ‌కాలు చేయాల్సి ఉంది. మ‌రోవైపు `కుషీ` అనే చిత్రంలోనూ న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తోంది.
Tags:    

Similar News