నిశ్చితార్థం రద్దు నిజమేనా గీత?

Update: 2018-09-09 10:40 GMT
‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక ‘గీత గోవిందం’ చిత్రంతో స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో చేరిపోయింది. త్వరలో ఈమె నాని - నాగార్జునలు కలిసి నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాస్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ చిత్రంలో నానికి జోడీగా ఈ అమ్మడు నటించింది. ‘గీత గోవిందం’ చిత్రంలో ఈమె విజయ్‌ దేవరకొండకు జంటగా నటించి మెప్పించింది. విజయ్‌ - రష్మికల రొమాన్స్‌ చాలా నేచురల్‌గా ఉంది అంటూ టాక్‌ వచ్చింది. ముద్దు సీన్స్‌ తో పాటు రొమాంటిక్‌ సీన్స్‌ లతో రష్మీక గీత పాత్రలో అలరించింది. తెలుగులో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిన రష్మిక ఎంగేజ్‌ మెంట్‌ క్యాన్సిల్‌ అయ్యింది అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.

కొన్నాళ్ల క్రితం కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టితో ఈ అమ్మడికి వివాహ నిశ్చితార్థం అయ్యింది. త్వరలో వీరిద్దరి పెళ్లి అనుకుంటున్న సమయంలో గీత గోవిందం సినిమా తర్వాత రష్మిక నిశ్చితార్థం క్యాన్సిల్‌ అంటున్నారు. తాజాగా ఇదే విషయమై ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో కథనం వచ్చింది. నిజంగానే రష్మి - రక్షిత్‌ ల వివాహ నిశ్చితార్థంను క్యాన్సిల్‌ చేసుకున్నారని, ఇకపై రష్మిక పూర్తి శ్రద్ద సినీ కెరీర్‌ పైనే పెట్టాలని భావిస్తున్నట్లుగా సదరు కథనంలో పేర్కొనడం జరిగింది.

‘గీత గోవిందం’ చిత్రంతో రష్మికకు స్టార్‌డం వచ్చింది. వచ్చిన అవకాశంను వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో రష్మిక పెళ్లిని పక్కకు పెట్టిందని, ఒక వేళ పెళ్లి అయితే ఎక్కువ ఆఫర్లు రావనే ఉద్దేశ్యంతో ఆమె నిశ్చితార్థంను బ్రేకప్‌ చేసుకుంది అంటూ కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రష్మిక వివాహ నిశ్చితార్థం బ్రేకప్‌ విషయమై రోజుకో వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసు విషయం ఏంటీ అనేది రష్మిక స్పందిస్తే కాని క్లారిటీ రాదు.

Tags:    

Similar News