వెల్ నోన్ భామలు పెళ్లాడేదెప్పుడు?
వివాహం విషయంలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివి. పెళ్లి చేసుకోవాలా? సింగిల్ లైఫ్ నే లీడ్ చేయాలా? అన్నది వారి ఇష్టాల మీదనే ఆధారపడి ఉంటుంది.;
వివాహం విషయంలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివి. పెళ్లి చేసుకోవాలా? సింగిల్ లైఫ్ నే లీడ్ చేయాలా? అన్నది వారి ఇష్టాల మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి ఎప్పుడు అనే టాపిక్ సహజంగా తలెత్తుతుంది. హీరో అయినా? హీరోయిన్ అయినా? ఈ ప్రశ్న ఎదురవ్వక తప్పదు. అలాంటి కొంత మంది వెల్ నోన్ భామలు కొందరున్నారు. వారింకా సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తున్నారు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే తమన్నా భాటియా, అనుష్క శెట్టి, త్రిష కృష్ణన్, అంజలి , పూజా హెగ్డే టాలీవుడ్ లో ఎంత ఫేమస్ అయ్యారో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వారి తెలుగు లోయాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారా? లేదా? అన్నది పక్కన బెడితే నిత్యం నెట్టింట మాత్రం వారి పెళ్లి టాపిక్ తెరపైకి వస్తూనే ఉంటుంది.
ఈ భామలంతా దశాబ్దన్నర కాలంగా తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే వీరిలో చాలామంది ఇప్పటికే 35 ఏళ్ల వయసు దాటినప్పటికీ ఇంకా ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టలేదు. త్రిష అనుష్క శెట్టి తెలుగు, తమిళ చిత్రసీమలో దశాబ్దాలుగా అగ్ర తారలుగా కొనసాగుతున్నారు. కెరీర్ పరంగా ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. అనుష్క `బాహుబలి` సిని మాతోప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. త్రిష తన గ్లామర్ , నటనతో ఇప్పటికీ యువ కథానాయికలకు గట్టి పోటీగా నిలుస్తుంది. ఈ క్రమంలో వారు ఎంచుకున్న వృత్తిపరమైన లక్ష్యాల కోసం చాలా కాలం పాటు వివాహాన్ని వాయిదా వేసారు. త్రిష కు ఓ బిజినెస్ మ్యాన్ తో నిశ్చితార్దం జరిగి మరీ క్యాన్సిల్ అయింది.
అప్పటి నుంచి పెళ్లి అనే టాపిక్ అమ్మడి వద్ద రావడం లేదు. వచ్చినా పెళ్లి తప్పకుండా చేసుకుంటాననే సమాధానమే వస్తుంది. అనుష్క విషయంలో అదే సన్నివేశం. ఇద్దరికీ ఇప్పటికే 40 లు దాటేసాయి. అనుష్క వయసు 44 కాగా, త్రిష వయసు 42 ఏళ్లు. తమన్నా విషయానికి వస్తే ప్రస్తుతం కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది. ఇంకొన్నళ్ల పాటు అవకాశాల పరంగా ఎలాంటి ఢోకా లేదు. తెలుగులో అవకాశాలు తగ్గితే హిందీలో అక్కడా తగ్గితే తమిళ్ అంటూ ఏదో భాషలో పని చేస్తూనే ఉంది. అలాగే వ్యక్తిగత జీవితం గురించి పంచుకోవడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ఇటీవల కాలంలో తమన్నా బంధాల గురించి బహిరంగంగానే మాట్లాడుతోంది.
వివాహం ఎప్పుడు అనే ప్రశ్నకు మాత్రం సమయం వచ్చినప్పుడు చెబుతానని సమాధానం ఇస్తోంది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సాధారణమని పరోక్షంగా చెబుతుంటుంది. ఈ బ్యూటీ వయసు 36 ఏళ్లు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. కానీ పెళ్లి వరకూ ఆ బంధాన్ని తీసు కెళ్లలేకపోయింది. అలాగే తెలుగు నటి అంజలి తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఈ బ్యూటీకి వయసు 40 సమీపిస్తోంది. ప్రస్తుతం 39 లో ఉంది. ఇంకా పెళ్లి అనే మాట అమ్మడి నోట రావడం లేదు. ప్రేమ వ్యవహారాల్లో అమ్మడి పేరు వినిపించింది చాలా అరుదు.
మరి పెళ్లికి వ్యతిరేకమా? అంటే అలాంటిది లేదని సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటానేనే బధులిస్తుంది. మరో హీరోయిన్ ముంబై బ్యూటీ పూజాహెగ్డే వయసు 35 ఏళ్లు. ఈ బ్యూటీ నోట ఇంకా పెళ్లి అనే మాట రావడం లేదు. కెరీర్ ఆరంభంలో ఓ బాలీవుడ్ స్టార్ తో డేటింగ్ చేసిందనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత తెలుగు సినిమాలతో బిజీ అవ్వడంతో మళ్లీ అలాంటి కథనాలు ఛాన్స్ ఇవ్వలేదు. పెళ్లి విషయంలో ఈ బ్యూటీ కూడా పాజిటివ్ గానే స్పందిస్తుంది.