ధురంధర్ తో గట్టి సవాల్.. కానీ వీకెండ్ లో హౌస్ ఫుల్?

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా మూవీ ధురందర్: ది రివెంజ్ బాక్సాఫీస్‌ ను షేక్ చేస్తోంది.;

Update: 2026-03-30 07:16 GMT

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా మూవీ ధురందర్: ది రివెంజ్ బాక్సాఫీస్‌ ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి వారంలోనే ఆ చిత్రం రూ. 1000 కోట్ల మార్క్‌ ను దాటి ఓ రేంజ్ లో అదరగొడుతోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌ లో కూడా ఆ మూవీ భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్‌ల వరకు ధురందర్ 2 హవా కొనసాగుతోంది. సినిమా రిలీజ్ అయ్యి రెండో వారంలోకి అడుగుపెట్టినా, అదే జోరు తగ్గకుండా కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా వీకెండ్ షోలన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. భారీ డిమాండ్ కారణంగా ఇతర సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా మారింది. మొదట ఇచ్చిన స్క్రీన్లలో కూడా కొన్ని చోట్ల ధురందర్ 2 షోలు పెంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ధురందర్ 2 హాలీవుడ్ చిత్రాలపై కూడా ప్రభావం చూపడం విశేషం. రయాన్ గోస్లింగ్ నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైనప్పటికీ.. ఇండియాలో మాత్రం స్క్రీన్ల కొరతను ఎదుర్కొంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా హాలీవుడ్ సినిమాలు విడుదలైనప్పుడు దేశంలోని మల్టీప్లెక్స్‌ లలో మంచి స్క్రీన్ కౌంట్ దక్కుతుంది.

ముఖ్యంగా అత్యుత్తమ సౌండ్, విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం పీవీఆర్, ఐనాక్స్ వంటి ప్రీమియం స్క్రీన్లలో ప్రదర్శిస్తారు. అయితే, ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ధురందర్ 2కు ఉన్న భారీ క్రేజ్ కారణంగా మల్టీప్లెక్స్‌ లలో ఎక్కువ శాతం స్క్రీన్లు అదే సినిమాకు దక్కాయి. దీంతో ప్రాజెక్ట్ హెయిల్ మేరీకి ఆశించిన స్థాయిలో షోలు దక్కలేదని సినీ వర్గాల్లో చర్చ జరిగింది.

అయినప్పటికీ, హైదరాబాద్ వంటి నగరాల్లో వీకెండ్ సమయంలో ఆ హాలీవుడ్ చిత్రం కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదు చేయడం గమనార్హం. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ విషయానికి వస్తే.. అది సైన్స్ ఫిక్షన్ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. కథలోని శాస్త్రీయ అంశాలు ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఏలియన్ పాత్ర రాకీ, హీరో మధ్య ఏర్పడే బాండింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

అలాగే ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్స్ కథకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అయితే, సినిమా మొత్తం సైన్స్ పై ఆధారపడటం వల్ల కొందరు ప్రేక్షకులకు ఇది కాస్త నెమ్మదిగా అనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు, సైన్స్ ఫిక్షన్ జానర్‌ ను ఇష్టపడే వారికి మాత్రం చిత్రం బాగా నచ్చుతుందని రివ్యూలు వస్తున్నాయి మొత్తంగా చూస్తే, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ధురందర్ 2 దూకుడు కొనసాగుతూనే ఉంది. ఆ జోరు తగ్గేలా కనిపించడం లేదు. హాలీవుడ్ చిత్రాలకు కూడా సవాలు విసురుతూ మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News