కిరణ్ అబ్బవరం.. ఇకపై మరో లెక్క..

యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం మంచి ఫామ్‌ లో కొనసాగుతున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.;

Update: 2026-03-30 05:33 GMT

యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం మంచి ఫామ్‌ లో కొనసాగుతున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఇటీవల విడుదలైన సినిమాలతో వరుస విజయాలు అందుకోవడంతో ఆయనను మినిమమ్ గ్యారంటీ హీరోగా అంతా భావిస్తున్నారు. ఆ హిట్స్ ప్రభావంతో కిరణ్ మార్కెట్ బాగా పెరిగింది. అదే సమయంలో కొత్త ఆఫర్లు కూడా వరుసగా వస్తున్నాయి.

ఇప్పటివరకు ఒక లెక్కలో ఉన్న కిరణ్ అబ్బవరం కెరీర్, ఇకపై మరో లెక్కలో ఉండబోతుందనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. కారణం ఆయన చేతిలో ఉన్న భారీ లైనప్. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం దగ్గర దాదాపు అరడజను ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. ఇందులో సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా ఉండటం విశేషమని చెప్పాలి.

అయితే కిరణ్ థియేటర్లలో సందడి చేయబోయే ప్రాజెక్టుల్లో చెన్నై లవ్ స్టోరీ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. లవ్, ఎమోషన్‌ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన కథతో ఆ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక డిజిటల్ ప్లాట్‌ ఫామ్ వైపు కూడా కిరణ్ అడుగులు వేస్తున్నారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కోసం ఆయన గువ్వలచెరువు ఘాట్ వెబ్ సిరీస్‌ లో నటిస్తున్నారు. డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సిరీస్‌ నుంచి ఇటీవల విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ ప్రాజెక్టు ద్వారా కిరణ్ కొత్త కోణంలో కనిపించబోతున్నారని టాక్. అలాగే ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడైన వీర కోగటం దర్శకత్వంలో కిరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రాయలసీమ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌ గా ఆ మూవీ తెరకెక్కనుంది. కిరణ్ ఇప్పటి వరకు చేసిన పాత్రలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇవి కాకుండా కిరణ్ అబ్బ వరం స్వయంగా దర్శకత్వం వహించే ప్రాజెక్టుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే పనులు దాదాపు పూర్తయ్యాయని సమాచారం. ఆ చిత్రం ద్వారా ఆయన నటుడిగానే కాకుండా దర్శకుడిగా తన ప్రతిభను చూపించాలని భావిస్తున్నారు. మరిన్ని రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా చూస్తే కిరణ్ కెరీర్ ఇప్పుడు కీలక దశలో ఉందని చెప్పవచ్చు. లైనప్‌ లోని సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తే, ఆయన మార్కెట్ మరింత పెరగడం ఖాయం. అదే సమయంలో టాలీవుడ్‌ లో ఆయన స్థానం మరింత స్ట్రాంగ్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కిరణ్, తన కెరీర్‌ ను కొత్త దిశగా తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఆయన ఎంచుకునే కథలు, చేసే సినిమాలు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ప్రేక్షకులు కూడా ఆ యంగ్ హీరో నుంచి మరిన్ని మంచి సినిమాలు ఆశిస్తున్నారు.

Tags:    

Similar News