• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇలాంటి టైంలో రష్మిక...

ఇలాంటి టైంలో రష్మిక రిస్క్ చేస్తోందా..?

By - Tupaki Desk
Update: 2020-03-20 05:41 GMT
'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ రష్మికా మందన్న. తొలి చిత్రం ఇచ్చిన విజయంతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్', 'దేవదాస్', 'సరిలేరు నీకెవ్వరూ' వంటి భారీ చిత్రాలతో లక్కీ హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ దక్కించుకుంది. అందంతో పాటు అభినయం కూడా సొంతం చేసుకున్న ఈ భామ తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. రీసెంట్ గా విడుదలైన 'భీష్మ' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ హోదాలో చేరిపోయింది. అయితే సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమి జరుగుద్దో ఎవరూ చెప్పలేరు. నేటితరం హీరోహీరోయిన్లు మరీ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముద్దుగుమ్మ రష్మిక మందన్న తీసుకున్న ఓ నిర్ణయం సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తూ, వరుస విజయాలతో దూకుడు మీదున్న రష్మిక నిర్మాతగా మారబోతుందంట. కొత్త తరహా కథల కోసం చూస్తున్నానని, ఎవరి దగ్గరయినా మంచి కథలు ఉంటే తనకి మెయిల్ చేయమని ఒక ఈమెయిల్ ఐడీ కూడా ఇచ్చింది. తన దగ్గర చాలా చిన్న టీం ఉందని, కథలు చదివి రెస్పాండ్ అవడానికి సమయం పడుతుందని, అంతవరకు సంయమనంతో ఉండాలని కోరింది. రష్మిక తీసుకున్న ఈ నిర్ణయంపై ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వాగతించదగినదే అయినా కెరీర్ ఆరంభంలోనే ఇలా ఎందుకు చేయడం అని కొందరు సలహా ఇస్తుండగా, తెలుగులో హీరోయిన్లు నిర్మాతలుగా మారి సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ అని మరికొందరు జాగ్రత్తలు చెప్తున్నారు. నిజానికి మన సినీ ఇండస్ట్రీ లో నిర్మాతలు గా మారిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. కానీ వారిలో సక్సెస్ అయిన వాళ్ళకంటే చేతులు కాల్చుకున్న వారే ఎక్కువ. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. దీంతోపాటు రామ్ చరణ్ తదుపరి సినిమాలో రష్మిక నే హీరోయిన్ గా అనుకుంటున్నారంట. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకొని, కెరీర్ పీక్ స్టేజిలో ఉన్న ఇలాంటి టైంలో రష్మిక తీసుకున్న నిర్ణయం పెద్ద సాహసమే అని చెప్పాలి.
Tags:    
  • Rashmika Mandanna to turn producer 
  • Rashmika Mandanna 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Movie News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS