హాట్ టాపిక్: రష్మిక చేతి పచ్చబొట్టు

Update: 2018-09-21 08:53 GMT
ఫిలిం ఇండస్ట్రీలో హిట్ ఉన్నవారిపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.  కన్నడ బ్యూటీ రష్మిక మందన్న 'ఛలో'.. 'గీత గోవిందం' లాంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.  ఇక లైన్లో ఉన్న సినిమాలు కూడా క్రేజీ ప్రాజెక్టులే.  సెప్టెంబర్ 27 న రిలీజ్ కానున్న 'దేవాదాస్' రష్మిక హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. నిన్న 'దేవదాస్' ఆడియో ఫంక్షన్ జరిగింది.  ఇక ఆ ఈవెంట్ లో చాలామందిని ఆకర్షించిన అంశం ఒకటుంది.

అదే రష్మిక ఎడమ చేతిపై ఉన్న పచ్చబొట్టు. ఇంగ్లీష్ లెటర్స్ లో 'Irrepleceable' అనే పదం.  ఇక ఈ ఇర్రిప్లేసబుల్  లో లాస్ట్ ఉండే 'ఈ' ఆక్షరం నెత్తి మీద ఒక లవ్ సింబల్ ఉంది.  కొత్త టాటూ కావడంతో అదిప్పుడు హాట్ టాపిక్ అయింది.  తన సహనటుడు కన్నడ ఫిలింమేకర్ అయిన రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత.. బ్రేకప్ విషయం ఇద్దరూ ఓపెన్ అయిన తర్వాత రష్మిక హాజరయిన ఫస్ట్ పబ్లిక్ ఈవెంట్ ఇదే. దీంతో రక్షిత్ శెట్టి తో బ్రేకప్ విషయం తనకు ఎంతో బాధ కలిగించిందని అందుకే అలాంటి టాటూ వేయించుకుందని కొందరు నెటిజనులు అర్థాలు చెప్తున్నారు.

ఇక రష్మిక ఏ ఉద్దేశంతో ఆ టాటూ ను వేయిచుకుందో మనకు మాత్రం తెలియదు. ఇర్రిప్లేసబుల్ అంటే ఇంపాజిబుల్ టూ రీప్లేస్ అని ఇంగ్లీష్ మీనింగ్ చెబుతోంది గూగులమ్మ. మరి గీతమ్మ ఈసారి ఇంటర్వ్యూలో ఏమైనా దానిగురించి చెబుతుందేమో చూడాలి. అప్పటివరకూ మీకు ఏమనిపిస్తుందో అదే అనుకోండి..!
Tags:    

Similar News