• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గోల్డెన్ గ‌ర్ల్' అంటూ...

'గోల్డెన్ గ‌ర్ల్' అంటూ చాటింపు వేసుకుంటోంది

By - Tupaki Desk
Update: 2022-09-27 04:03 GMT
డిఐడి సూపర్ మామ్స్ గ్రాండ్ ఫినాలే సెప్టెంబర్ 25న జరిగింది. ఈ షోలో రష్మిక మందన్న - గోవింద జంట సంద‌డి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వేదిక‌పై 'పుష్ప' కల్ట్ సాంగ్ సామి సామికి డ్యాన్స్ చేస్తూ ఆ ఇద్ద‌రూ అభిమానులను అలరించారు. ఒరిజినల్ లో రష్మిక మందన్న - అల్లు అర్జున్ హుక్ స్టెప్పు తో అల‌రించారు. దీనినే ఈ వేదిక‌పై రిపీట్ చేసారు ఈ జోడీ. గోవిందా బాలీవుడ్ లో గొప్ప డ్యాన్స‌ర్ గా కీర్తినార్జించాడు. ఇప్పుడు  రష్మికతో సామి సామికి స్టెప్పులు వేయ‌గా ప్రేక్షకులు విజిల్స్ తో ఎంక‌రేజ్ చేసారు.

ఈ వేదిక‌పై ర‌ష్మిక వేష‌ధార‌ణ ఇప్పుడు హాట్ టాపిక్. ర‌ష్మిక గోల్డెన్ గాళ్ లుక్ తో త‌ళ‌త‌ళ‌లాడింది. పసుపు- బంగారు వ‌ర్ణం ధ‌గ‌ధ‌గ‌ల‌ చీర- ర‌వికెలో అందంగా కనిపించింది. గోవిందా నల్లటి సూట్ లో స్మార్ట్ గా కనిపించాడు.

వీరిద్దరు గోవిందా న‌టించిన‌ కొన్ని బాలీవుడ్ పాటలకు డ్యాన్సుల‌తో సంద‌డి చేసారు. బ‌న్ని- రష్మిక నటించిన పుష్ప: ది రైజ్‌లోని సామీ సామీ పాట విడుదలైనప్పటి నుండి ఉత్త‌రాదిన వీప‌రీత‌మైన అభిమానాన్ని పొందింది. ఇప్పుడు తాజా యాక్ట్ తో అది మ‌రింత వైర‌ల్ అవుతోంది.

ర‌ష్మిక ఫోటోషూట్ తో కిక్కు

తాజాగా ర‌ష్మిక మంద‌న లేటెస్ట్ ఈవెంట్ లుక్ ఫోటోలు అంత‌ర్జాలంలో సునామీలా వైర‌ల్ అవుతున్నాయి. కొన్ని క్ష‌ణాల్లోనే దాదాపు 1.7 మిలియన్ లైక్ లను ఈ ఫోటోషూట్ సంపాదించింది. సోషల్ మీడియాలో అనుచ‌రుల సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతోంది. ''ఈరోజు నేను గోల్డెన్ గ‌ర్ల్.. హౌ కూల్.. ఈ లుక్ ని అంగీక‌రిస్తున్నారా?  గుడ్ బాయ్'' అంటూ ర‌ష్మిక క్రిప్టిక్ (న‌ర్మ‌గ‌ర్భంగా) గా వ్యాఖ్య‌ను జోడించింది. మొత్తానికి ర‌ష్మిక త‌న‌ను తాను గోల్డెన్ గాళ్ గా ప్ర‌చారం చేసుకుంటోంది. గోల్డెన్ దుస్తుల్లో మెర‌వ‌డ‌మే కాదు.. తాను స్వ‌ర్ణ‌సుంద‌రిగా వెలిగిపోతున్నాన‌ని చాటుకుంటోంది.

రష్మిక ప్ర‌స్తుతం బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. త‌న తొలి చిత్రం  గుడ్ బై త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ ప్ర‌చారంలో భాగంగా ర‌ష్మిక ర‌క‌ర‌కాల వేదిక‌ల‌పై సంద‌డి చేస్తోంది. బుల్లితెర కార్య‌క్ర‌మాల్లో ప్ర‌చారం హోరెత్తిస్తోంది. అలా సీనియ‌ర్ హీరో గోవిందాతోనూ ర‌ష్మిక‌కు ఒక అవ‌కాశం ద‌క్కింది. దానిని ఈ బ్యూటీ చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకుంద‌ని చెప్పాలి. ముఖ్యంగా ర‌ష్మిక త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకునేందుకు చ‌క్క‌ని ప‌ద‌జాలంతో చాటింపు వేసుకుంటోంద‌ని నెటిజ‌నులు కొంద‌రు కౌంట‌ర్లు వేస్తున్నారు.

మ‌రోవైపు ర‌ష్మిక న‌టించిన 'మిషన్ మజ్ను' విడుద‌ల కావాల్సి ఉంది.  ఇందులో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి యాక్ష‌న్ క్వీన్ గా స్పై పాత్ర‌లో ర‌ష్మిక క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. అలాగే స్టార్ హీరో ర‌ణ‌బీర్ యానిమల్ లోను ర‌ష్మిక క‌థానాయిక‌. సందీప్ వంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస‌తున్నారు.  తమిళంలో రష్మిక తదుపరి చిత్రం విజయ్ తో వరిసు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అల్లు అర్జున్ తో పుష్ప 2 ఇప్పటికే చిత్రీక‌ర‌ణ సాగుతోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • TollywoodActress 
  • RashmikaMandanna 
  • Govinda 
  • DIDSuperMomsGrandFinale 
  • PushpaFilm 
  • RashmikainGoldColorDress 

Similar News

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS