• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క‌ల‌ల్లో...

క‌ల‌ల్లో విహ‌రిస్తున్న‌ట్టుగా వుంద‌ట‌

By - Tupaki Desk
Update: 2022-09-07 02:30 GMT
క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న‌. `పుష్ప‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత ర‌ష్మిక కెరీర్ ప‌రంగా రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. బాలీవుడ్ లో క్రేజీగా అడుగులు వేస్తూ స‌ర్ ప్రైజింగ్ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తూ ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. బాలీవుడ్ లో ర‌ష్మిక న‌టించిన తొలి మూవీ `మిష‌న్ మ‌జ్ను`. సిద్ధార్ధ్ మ‌ల్హొత్రా హీరోగా శంత‌ను బ‌గ్చి తెర‌కెక్కిన ఈ మూవీని ఇండియా - పాకిస్థాన్ నేప‌థ్యంలో సాగే సీక్రెట్ మిష‌న్ నేప‌థ్యంలో రూపొందించారు.

అయితే అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ మూవీ షూటింగ్ ముందు పూర్తి చేసుకున్నా `గుడ్ బై` ముందుగా రిలీజ్ అవుతోంది. అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ మూవీలో ఆయ‌న‌కు కూతురిగా ర‌ష్మిక మందన్న న‌టించింది. మంగ‌ళ‌వారం ఈ మూవీ ట్రైల‌ర్ ని  రిలీజ్ చేశారు. వికాస్ బెహెల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని అక్టోబ‌ర్ 7న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇదిలా వుంటే అల్లు అర్జున్ తో ర‌ష్మిక న‌టించ‌నున్న `ఫుష్ప 2` షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది.

ఇటీవ‌లే లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని ఈ నెల‌లోనే ప్రారంభించ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో మీడియాతో ముచ్చ‌టించిన ర‌ష్మిక మంద‌న్న ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డిచింది. ఈ మూవీని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఫిల్మ్ `పుష్ప‌`కు సీక్వెల్ గా తెర‌కెక్కించ‌బోతున్న విష‌యం తెలిసిందే.  ఒకే స‌మ‌యంలో ఇద్ద‌రు `ఏ` (అల్లు అర్జున్‌, అమితాబ్ బ‌చ్చ‌న్) ల‌తో  క‌లిసి వ‌ర్క్ చేయ‌డం ఎలా వుంద‌ని అడిగితే ర‌ష్మిక ఆస‌క్తిక‌రంగా స్పందించింది.

క‌ల‌ల్లో విహ‌రిస్తున్న‌ట్టుగా వుంద‌ని, అది అల్లు అర్జున్ స‌ర్ తో మాత్ర‌మే చెప్ప‌గ‌ల‌న‌ని..పుష్ప 2 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని వెల్ల‌డించింది. అంతే కాకుండా మ‌రి కొన్ని రోజుల్లో `పుష్ప 2` ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బ‌చ్చ‌న్ స‌ర్ తో క‌లిసి న‌టించిన `గుడ్ బై` మూవీ ట్రైల‌ర్ ని ప్రేక్ష‌కుల‌తో పంచుకున్న ఆనందాన్ని ఏమ‌ని చెప్ప‌గ‌ల‌ను` అంటూ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసింది.

ర‌ష్మిక మంద‌న్న ఈ మూవీస్ తో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో విజ‌య్ హీరోగా వంశీ పైడిప‌ల్లి రూపొందిస్తున్న `వార‌సుడు`లో న‌టిస్తోంది. అంతే కాకుండా `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో ర‌ణ్ బీర్ క‌పూర్ తో రూపొందిస్తున్న `యానిమ‌ల్‌`లోనూ న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Tollywood 
  • starheroine 
  • rashmikamandanna 
  • bollywood 
  • movies 
  • telugunews 
  • latestnews 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS