లవ్‌.. మ్యారేజ్ విషయంలో శ్రీవల్లి ఫుల్‌ క్లారిటీ

Update: 2022-02-16 16:30 GMT
ఛలో మరియు గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన రష్మిక మందన్నా ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలుగు లోనే కాకుండా తమిళం.. హిందీ.. కన్నడం భాషల్లో కూడా సినిమాలు చేస్తూ మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న రష్మిక మందన్నా పుష్ప సినిమా తో మరింత పాపులర్ అయ్యింది.

పుష్ప సినిమా తర్వాత రష్మిక మందన్నా ఆఫర్లు పెరగడంతో పాటు పారితోషికం కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం పుష్ప పార్ట్‌ 2 కోసం రెడీ అవుతున్న విషయం తెల్సిందే.

ఇదే సమయంలో  ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీలో ఈమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు ఒక చిట్‌ చాట్ లో ప్రేమ గురించి.. కాబోయే భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఏ వ్యక్తితో అయితే సెక్యూర్‌ గా ఉంటాం అనిపిస్తుందో.. కంఫర్ట్‌ గా అన్ని విషయాలు షేర్‌ చేసుకుంటూ స్నేహంగా ఉంటాం అనిపిస్తుందో అతడే జీవితంకు మంచి లైఫ్‌ పార్టనర్‌ అవుతాడంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

ఇద్దరు సమానంగా అభిప్రాయాలు షేర్ చేసుకుంటూ ఒకరిని ఒకరు సమానంగా చూసినప్పుడు మాత్రమే అది టూ సైడ్‌ లవ్‌ అవుతుంది.. అంతే తప్ప ఒకరి ఫీలింగ్స్ ను మరొకరు అర్థం చేసుకోకుంటే అది వన్ సైడ్‌ లవ్‌ అవుతుందని ఆమె చెప్పుకొచ్చింది.

గీత గోవిందం మరియు టాక్సీవాలా సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా లు ప్రేమలో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. వీరిద్దరు కలిసి పబ్‌ లు పార్టీలు తిరుగుతున్నారు.

అదే సమయంలో విజయ్ దేవరకొండ ఇంట్లో ఏ ప్రత్యేక సందర్బం అయినా కూడా రష్మిక మందన్నా ఉంటుంది. అందుకే వారిద్దరు ప్రేమలో ఉన్నట్లుగా చాలా మంది బలంగా వాదిస్తున్నారు. ఆ వాదన నిజమేనేమో అనిపించేలా కొన్ని సంఘటనలు కూడా జరిగాయి.

ఇప్పటి వరకు మేము ఇద్దరం మంచి స్నేహితులం అంటూ చెప్పుకొచ్చిన వీరిద్దరు ఏదైన సమయంలో తమ ప్రేమ వ్యవహారంను వెళ్లడిస్తారేమో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల కూడా వీరిద్దరు ముంబయిలో ఒక పార్టీ లో సందడి చేశారు.

విజయ్ దేవరకొండకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా రష్మిక సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇది స్నేహం అయ్యి కూడా ఉంటుంది. కాని ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News