శ్రుతిహాసన్‌ని మించిపోయేలా కిక్కిచ్చేలా నభా ఐటెమ్!

సినిమాల్లో ఐటమ్ లేదా స్పెషల్ సాంగ్స్‌లో నర్తించడం అనేది పైకి కనిపించినంత సులువైన విషయం కాదు.

Update: 2026-06-25 05:21 GMT

సినిమాల్లో ఐటమ్ లేదా స్పెషల్ సాంగ్స్‌లో నర్తించడం అనేది పైకి కనిపించినంత సులువైన విషయం కాదు. కేవలం ఐదారు రోజుల షూటింగ్ కోసమే లక్షలు లేదా కోట్ల రూపాయిల భారీ పారితోషికం అందుకుంటున్నామనే ఉత్సాహం కంటే.. ప్రేక్షకులను మెప్పించాలనే బాధ్యతే హీరోయిన్లపై ఎక్కువగా ఉంటుంది. గతంలో వచ్చిన సూపర్ హిట్ ఐటమ్ నంబర్లలో చెలరేగిపోయిన ఇతర కథానాయికలను డామినేట్ చేసేలా తమ ప్రదర్శన ఉండాలనే టెన్షన్ ప్రతి హీరోయిన్ లేదా ఐట‌మ్ భామ‌ల‌కు ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ అందాల భామ నభా నటేష్ ముందు కూడా అలాంటి ఒక భారీ సవాల్ ఎదురైంది. మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న సరికొత్త చిత్రంలో ఈ క‌న్న‌డ‌ బ్యూటీ ఒక ప్రత్యేక గీతంలో మెరవడానికి సిద్ధమవుతోంది.

మాస్ మహారాజ్ రవితేజ సినిమాల్లో స్పెషల్ నంబర్ చేయడం అంటే అది నిజంగానే ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే రవితేజ స్క్రీన్ ఎనర్జీకి తగ్గట్టుగా, ఆయనతో పోటీ పడుతూ రంజింపజేసే నృత్యాలు చేయాల్సి ఉంటుంది. పైగా రవితేజ కెరీర్‌లో గతంలో ఎన్నో బెస్ట్ ఐటమ్ నంబర్లు ఉన్నాయి. ఉదాహరణకు.. గతంలో వచ్చిన `బలుపు` చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ అదిరిపోయే ఐటమ్ నంబర్‌తో కుర్రకారులో గుబులు రేపింది. అందాల ఆరబోతతో పాటు తన ఎనర్జిటిక్ డ్యాన్సులతో థియేటర్లలో ఈలలు వేయించింది. అలాగే `ఈగిల్` చిత్రంలో కావ్య థాపర్ సైతం తన ఎనర్జిటిక్ - ఎక్స్‌ప్రెసివ్ డ్యాన్సింగ్ స్టైల్‌తో కుర్రాళ్ల గుండెల్లో మంటలు పుట్టించింది. సీసా సాంగ్ లో అన్వేషి జైన్, బెల్లా సాంగ్ లో ఆషిక రంగ‌నాథ్ అదిరిపోయే నృత్యాల‌తో క‌ట్టిప‌డేసారు. అంతకుముందు కూడా ఎందరో భామలు రవితేజ పక్కన అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్, ఎనర్జీతో అలరించారు. అందుకే ఇప్పుడు నభా నటేష్ కూడా వాటన్నిటినీ మించేలా కిక్కివ్వాలని మాస్ అభిమానులు ఆశిస్తున్నారు.

స్వతహాగానే నభా నటేష్ తన కిల్లర్ మూవ్స్‌తో, గ్లామర్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రతిభావని. డ్యాన్సుల్లో ఈ బ్యూటీ ఒక మాస్టర్ క్లాస్ పెర్ఫామర్ అని చెప్పవచ్చు. `ఇస్మార్ట్ శంకర్` వంటి చిత్రాల్లో న‌భా ఎనర్జీని ప్రేక్షకులు ఇప్పటికే చూశారు. అందుకే ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో ఈ క‌న్న‌డ క‌స్తూరి ఎలాంటి ఐటమ్ నంబర్ చేయబోతోంది... ఏ రేంజ్‌లో రచ్చ లేపబోతోంది? అనేది చూడాల‌నే ఉత్సాహం అందరిలోనూ నెలకొంది. అయితే నభాలోని హై ఎనర్జీని, డ్యాన్స్ క్వాలిటీని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా కొరియోగ్రాఫర్స్ త‌న‌ కోసం మరో మాస్టర్ క్లాస్ కొరియోగ్రఫీని ఆవిష్కరిస్తారా లేదా? రవితేజ, నభాల కాంబినేషన్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతోంది? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

న‌భా ఐట‌మ్ నంబ‌ర్ చేయ‌బోతున్న‌ `ఇరుముడి` షూటింగ్‌ శరవేగంగా పూర్త‌వుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 21న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను.. మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి మాలధారిగా కనిపించనుండటం.. అలాగే కూతురితో ర‌వితేజ‌త ఉండే ఎమోషనల్ బాండింగ్ సినిమాకే మేజర్ హైలైట్స్ అని చెబుతున్నారు. కేవలం సెంటిమెంట్ మాత్రమే కాకుండా... ఈ చిత్రం పక్కా మాస్ యాక్షన్‌తో కూడి ఉంటుందని.. ఇందులో రవితేజ సరికొత్త లుక్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. ఒక సెంటిమెంట్ డ్రామా, యాక్షన్ తో కూడుకున్న చిత్రంలో బిగ్ రిలీఫ్ కోసం న‌భా న‌టేష్ స్పెష‌ల్ నంబ‌ర్ ప్లాన్ చేసార‌ని తెలుస్తోంది. చిత్ర‌యూనిట్ వివ‌రాల ప్ర‌కారం.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన భారీ సెట్‌లో రవితేజ, నభాలపై ఈ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నభా నటేష్ ఐటమ్ సాంగ్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News