ఆ విషయంలో రష్మిక అందరికంటే టాప్!
టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక మందన్నా టాప్ స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతున్న విషయం తెల్సిందే. తెలుగు లో ఈ అమ్మడు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తుంది. ఈమె కంటే ఎక్కువ సినిమాలు చేసే హీరోయిన్స్ మరియు ఈమె కంటె ఎక్కువ పారితోషికాలు తీసుకునే హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. కాని సౌత్ లో రష్మిక రేంజ్ లో ఆస్తులున్న హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. తన తండ్రి నుండే రష్మికకు చాలా ఆస్తులు వచ్చాయి. ఆమెకు కాఫీ తోటలు ఇతర ఆస్తులు కూడా ఉన్నాయి.
ఇప్పుడు రష్మిక తనకు వస్తున్న పారితోషికాలతో పాటు గతంలో ఉన్న ఆస్తులు మరియు ఇతర ఆస్తుల ఆదాయాల కారణంగా అత్యంత ఆదాయం కలిగిన హీరోయిన్ గా నిలిచింది. సౌత్ లో హీరోయిన్ లు పలువురు ఉన్నారు. వారిలో చాలా మంది భారీ పారితోషికాలు తీసుకుంటారు. అయినా కూడా వారు రష్మిక మందన్న రేంజ్ లో ఆస్తులు కలిగి లేరు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ లో.. గోవాలో మరియు తన సొంత ప్రాంతం లో ఇంకా పలు ప్రాంతాల్లో రష్మిక మందన్నా ఇళ్లులు కొనుగోలు చేసింది. అంతే కాకుండా ఆస్తులను కూడా కూడబెట్టింది.
తాజాగా ముంబయిలో ఈమె ఒక ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమద్య కాలంలో రష్మిక బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. అక్కడ సెటిల్ అయ్యేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్న రష్మిక మందన్నా అక్కడ ఒక ఇల్లును కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. సినిమాల ద్వారా వచ్చే ఆదాయం కాకుండా ఈమెకు ఉన్న వ్యాపారాలు మరియు స్థిరాస్తుల వల్ల వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండటం వల్ల అందరిలోకి ఈమెనే టాప్ అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు నుండే రష్మిక కుటుంబం మంచి వ్యాపారస్తుల కుటుంబంగా చెబుతున్నారు. ఆమద్య రష్మిక కుటుంబ సభ్యులపై ఐటీ దాడులు కూడా జరిగిన విషయం తెల్సిందే.