• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆచార్యలో చరణ్ కి జోడి...

ఆచార్యలో చరణ్ కి జోడి దొరికేసిందట!

By - Tupaki Desk
Update: 2020-05-31 00:30 GMT
టాలీవుడ్ మెగాస్టార్ 152వ సినిమాగా రూపొందుతున్న ఆచార్య సినిమా పై రోజురోజుకి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ మరో వైపు ఇంకా సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో అని అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మాట్నీ ఎంటర్టైన్మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ఆచార్య అనే పేరు ఖరారు అయిందని తెలిసినప్పటి నుండి ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తయిందట. నిజానికి ఈ నెలలోనే ఓ భారీ షెడ్యూల్ మొదలు కావాల్సి ఉండగా లాక్ డౌన్ వలన కుదరలేదు. అయితే ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సామాజిక అంశాలు టచ్ చేస్తుందట. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

చిరంజీవి, చరణ్ కలిసి గతంలో రెండు మూడు సినిమాలలో కనిపించారు. కానీ నిడివిగల పాత్రలు చేయలేదు. అయితే ఈ సినిమాలో రాంచరణ్ పాత్ర చాలా నిడివితో ఉంటుందని కొరటాల వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేగాక ఆచార్య సినిమా సినిమాలో చరణ్ కు ఒక హీరోయిన్ కూడా ఉంటుందని తెలిపారు. ఇంతకాలం ఆ హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్న చిత్ర బృందం.. ప్రస్తుతం ఓ హీరోయిన్ ని ఓకే చేసినట్లు తెలుస్తుంది. చరణ్ జోడిగా మొన్నటి వరకు సమంత, కియారాలు నటిస్తారని వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. చరణ్ సరసన ఛలో బ్యూటీ రష్మిక దాదాపు ఖరారు అయిందట. అధికారికంగా బయటికి ఈ వార్త రానప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త హల్చల్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో చిరుకి జంటగా కాజల్ నటిస్తున్న విషయం తెలిసిందే. మరో విషయం ఏంటంటే.. లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి సినిమా షూటింగ్ పూర్తి అయ్యేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చరణ్-చిరు మరోసారి తెరపై మ్యాజిక్ చేస్తారేమో చూడాలి!
Tags:    
  • Acharya 
  • Ram charan 
  • Chiranjeevi 
  • Rashmika 
  • koratala siva 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS