నీటి కాలుష్యం మీద గీత చైతన్యం
స్వంత పేరు కన్నా గోవిందుడిగా విజయ్ దేవరకొండతో సారీ మేడం అంటూ ఏడిపించిన గీతగానే తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయిన రష్మిక మందన్న డిమాండ్ ఇప్పుడు మాములుగా లేదు. ఒకపక్క తెలుగులో బిజీగా ఉంటూనే మరోపక్క వీలు దొరికినప్పుడంతా కన్నడ సినిమాలు కూడా చేస్తూనే ఉంది. ప్రస్తుతం విజయ్ తోనే డియర్ కామ్రేడ్ తో జట్టు కట్టిన రష్మిక నితిన్ తో మొదటి సారి జంటగా కనపడనుంది. ఇదిలా ఉండగా రష్మిక మందన్న కాలుష్యం మీద అవగాహన కల్పించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది.
బెంగళూర్ నగరంలో బెల్లందూర్ సరస్సు బాగా ఫేమస్. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సరస్సు చూడడానికే పర్యాటకులు వచ్చేవారు. కాని ఇప్పుడు ఈ అపురూప నీటి సంపద ప్రమాదంలో చిక్కుకుంది. కాలుష్యంతో పాటు నగర వాసుల నిర్లక్ష్యం తోడై వ్యర్థ పదార్థాలన్ని అడుగుకు చేరిపోయి మొత్తం నీరు ప్రమాద స్థాయిని దాటేసింది. ఇది ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో చెప్పడానికి రష్మిక మందన్న ఓ యాడ్ లో నటించింది. సన్మతి డి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ ఫిలింలో నటించేందుకు రష్మిక నిజంగానే బెల్లందూర్ సరస్సులో ఫోటో షూట్ లో పాల్గొంది.
సమస్య తీవ్రత గురించి తనకు ముందు తెలియదని లోతుకు వెళ్ళాక హృదయం విరిగిపోయిందని సముద్ర జీవాల ప్రాణాలు కాలుష్యం వల్ల నీటిలో చనిపోతున్నాయని చెబుతూ దీని వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాన్ని గుర్తించి అందరు మేల్కొనాలని పిలుపు ఇచ్చింది. ట్విట్టర్ లో షూట్ తాలుకు ఫోటోలు షేర్ చేసుకున్న సమంతా ఈ విషయాలు చెప్పి కాలుష్య నివారణకు తన వంతు ప్రయత్నం గట్టిగానే చేసింది