అద్దెగర్భంపై రష్మి వ్యాఖ్యలు.. హాట్ టాపిక్

Update: 2020-05-18 09:10 GMT
తెలుగులో ఉండే పాపులర్ యాంకర్లలో రష్మీ గౌతమ్  ఒకరు.  జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ తో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.  ఈమధ్య ఓ సందర్భంలో రష్మి సరోగసి విధానంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ అయ్యాయి.  పశువులకు అయినా సీజన్ ఉంటుందేమో కానీ మనుషులకుఎప్పుడు పడితే అప్పుదే.. సీజన్ ఉండదు ఏమీ ఉండదు  ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు దత్తత తీసుకోవడానికి ముందుకు రావడంలేదని పెద్ద పెద్ద సెలేబ్రిటీలు సరోగసి ద్వారా పిల్లలను కంటున్నారని.. దాని బదులు దత్తత తీసుకోవచ్చు కదా అంటూ నిప్పులు చెరిగారు.

సరోగసి(అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడం) బదులు దత్తత తీసుకుంటే మంచిదనే ఆలోచన చెప్పడం వరకూ బాగానే ఉంది కానీ "సొంత రక్తం అయితేనే ప్రేమిస్తారా? ఈ ధోరణి వివక్ష చూపడమేనని  ఇదంతా కులాభిమానం మతాభిమానం వంటిదేనని.. పిల్లల విషయంలో జీన్స్ కొంతవరకే వర్క్ అవుట్ అవుతుందని.. మిగతా తల్లిదండ్రుల పెంపకంపై ఆధారపడి  ఉంటుంది" అని చెప్పడం కొందరికి నచ్చలేదు.

 రష్మి కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సరోగసీ చట్ట వ్యతిరేకం కానప్పుడు దాన్ని ప్రశ్నించడమ అవివేకమని.. దత్తత తీసుకోవడంలేదని అంటున్నారు కానీ దత్తత తీసుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారనే విషయం రష్మి గుర్తించాలని కొందరు కామెంట్ చేస్తున్నారు.  సన్నీ లియోన్ కూతురు నిషా దత్త పుత్రికే అనే నిజం గుర్తించాలని అంటున్నారు.  అయినా ఈ విషయంలో ఎవరిష్టం వారిదని.. ఇలా ఉండకూదడదు అనే రష్మి ఎలా డిసైడ్ చేస్తుందని అంటున్నారు.

అయితే రష్మి అభిమానులు మాత్రం రష్మి ఉద్దేశం సరోగసీకి వ్యతిరేకం కాదని.. దాని బదులు అనాథ పిల్లలను దత్తత తీసుకుంటే వారికి తల్లిదండ్రులు.. ఓ మంచి కుటుంబం దొరుకుతుంది కదా అనే మంచి ఆలోచన మాత్రమేనని వెనకేసుకొస్తున్నారు. ఏదైతేనేం..  రష్మి కామెంట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి.
Tags:    

Similar News