'లార్డ్ మార్కో' లో టాలీవుడ్ స్టార్!
హనీఫ్ అదేనీ దర్శకత్వంలో తెరకెక్కిన మాలీవుడ్ చిత్రం `మార్కో` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.;
హనీఫ్ అదేనీ దర్శకత్వంలో తెరకెక్కిన మాలీవుడ్ చిత్రం `మార్కో` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రంగా తెరకెక్కిన చిత్రం ఏ సర్టిఫికెట్ చిత్రంగా రిలీజ్ అయి ఇండియన్ సినిమా హిస్టరీ లోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ స్థాయి హింసాత్మక చిత్రం రావడం అదే తొలిసారి. భారీ హింస.. రక్తపాతం తో ఒళ్లు గగుర్లు పొడిచే సన్నివేశాలెన్నో ఉన్నాయి. క్లైమాక్స్ లోనే ఈ కథకు ఇంకా కొనసాగింపు ఉంటుందని అర్దమైంది. దీంతో `మార్కో 2` ఎప్పుడు ఉంటుందని యాక్షన్ ప్రియులంతా నెట్టింట అడుగుతున్నారు.
తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా `లార్డ్ మార్కో` కూడా రెడీ అవుతోంది. `మార్కో`ని ఎక్కడ నుంచి ముగించారో `లార్డ్ మార్కో` అక్కడ నుంచే మొదలవుతుంది. ఇందులో ఉన్నిముకుందన్ మార్కో డి పీటర్ (మార్కో జూనియర్) పాత్రలో నటించాడు. యుక్తి తరేజా అనే మరియా అనే పాత్రలో హీరోయిన్‌గా కనిపించింది. సిద్దిఖ్ జార్జ్ డి పీటర్ (అడాట్టు జార్జ్ పాత్రలో అలరించగా, జగదీష్ టోనీ ఐజాక్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇంకా కబీర్ దుహాన్ సింగ్ సైరస్ ఐజాక్ పాత్రలో (విలన్) లో అదరగొట్టాడు. అభిమన్యు శమ్మి తిలకన్ రస్సెల్ ఐజాక్ పాత్రలో నటించాడు.
అన్సన్ పాల్ దేవరాజ్ (దేవ్) పాత్రలో, ఇషాన్ శౌకత్ విక్టర్ డి పీటర్ (హీరో తమ్ముడి) పాత్రలోనూ ఆద్యంతం ఆకట్టుకున్నారు. ఈ పాత్రలన్నీ లార్డ్ మార్కోలో కొనసాగింపు కొనసాగుతాయి. వీటితో పాటు అదనంగా మరికొన్ని పాత్రలు యాడ్ అవుతాయి. అయితే ఇందులో ఓ తెలుగు హీరో కూడా నటిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఓ తెలుగు హీరోను పెట్టుకుంటే మార్కెట్ పరంగా మరింత కలిసొస్తుంది. దీనిలో భాగంగా యూత్ స్టార్ నితిన్ ని నిరంగంలోకి దించుతున్నారుట. ఓ కీలక పాత్రలో నితిన్ నటించే అవకాశాలున్నాయంటున్నారు.
అదే జరిగితే నితిన్ కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకుంటుంది. కొంత కాలంగా నితిన్ కు సక్సెస్ లు లేని సంగతి తెలిసిందే. ఏ సినిమా చేసినా నష్టాలు తప్ప రూపాయి లాభం రావడం లేదు. పైగా రొటీన్ చిత్రాలు గా తేలిపోతున్నాయి. నితిన్ కెరీర్ మొత్తంలో చేసిన ప్రయోగాలు చాలా తక్కువే. ఈ నేపథ్యంలో లార్డ్ మార్కో లాంటి చిత్రంలో సరైన రోల్ పడితే? కెరీర్ పరంగా కలిసొస్తోంది. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు సహకరించే అవకాశం ఉంది. ఇప్పటికే హనీఫ్ అదేనితో దిల్ రాజు కు కమిట్ మెంట్ ఉన్న సంగతి తెలిసిందే. మార్కో విజయం చూసి అతడితో సినిమా నిర్మించేందుకు అడ్వాన్స్ చెల్లించారు. రాజుగారుకి ఎలాగూ నితిన్ బంధువు. కాబట్టి ఆయన మాటను నితిన్ కాదనలేడు.