హిస్ట‌రీ రిపీట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న సౌత్ యూనివర్స్

సౌత్ ఇండియన్ సినిమా పాన్ ఇండియా మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటడం మొద‌లుపెట్టింది బాహుబ‌లి సినిమాతోనే. ఆ సినిమా తర్వాత ఫ్రాంచైజ్‌లపై దృష్టి మరింత పెరిగింది.;

Update: 2026-02-25 19:30 GMT

సౌత్ ఇండియన్ సినిమా పాన్ ఇండియా మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటడం మొద‌లుపెట్టింది బాహుబ‌లి సినిమాతోనే. ఆ సినిమా తర్వాత ఫ్రాంచైజ్‌లపై దృష్టి మరింత పెరిగింది. ఇప్పుడు అదే ట్రాక్‌పై భారీ అంచనాలతో ముందుకు రాబోతున్న రెండు ప్రాజెక్టులు పుష్ప‌3 మ‌రియు కెజిఎఫ్3.

పాన్ ఇండియా ఫ్రాంచైజ్ రేస్

రాకీ భాయ్ ఎలివేషన్స్‌తో KGF సిరీస్ కు దేశవ్యాప్తంగా మాస్ ఇమేజ్‌ విప‌రీతంగా వ‌చ్చింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి నార్త్ బెల్ట్‌లోనూ భారీ మార్కెట్‌ను సొంతం చేసుకోవడం ఈ ఫ్రాంచైజ్ ప్రత్యేకత. మరోవైపు పుష్ప క్యారెక్టర్ స్టైల్, యాటిట్యూడ్, డైలాగ్స్‌తో నార్త్‌లో సెన్సేషన్ సృష్టించింది. ఈ రెండు సిరీస్‌లూ కేవలం సీక్వెల్స్‌లా మాత్ర‌మే కాకుండా, బ్రాండ్‌లుగా ఎదిగాయి. మెర్చండైజ్, సోషల్ మీడియా ట్రెండ్స్, ఫ్యాన్ బేస్.. ఇవ‌న్నీ క‌లిపి వీటిని పాన్ ఇండియా రేంజ్‌లో నిలబెట్టాయి. బాహుబలి ఫ్రాంచైజ్ తర్వాత సౌత్ నుంచి వచ్చి అంత‌టి హైప్, క్రేజ్ అందుకున్న ప్రాజెక్టులు ఇవే.

బాక్సాఫీస్ ప్రెడిక్షన్

ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న అంచనాల ప్రకారం ఈ రెండు సినిమాలూ రిలీజ్ త‌ర్వాత సౌత్ ఇండియ‌న్ సినిమాల్లో అత్యంత స‌క్సెస్‌ఫుల్ ఫ్రాంచైజ్‌లుగా నిల‌వ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు. య‌ష్, రాకీ భాయ్‌గా స్క్రీన్‌పై కనిపించే ప్రతిసారీ థియేటర్లు షేకవుతాయనే విశ్వాసం అభిమానుల్లో ఉంది. మరోవైపు అల్లు అర్జున్ మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్, యాక్షన్ స్టైల్ పుష్ప బ్రాండ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ రెండు సినిమాల‌కు ఓపెనింగ్స్ విషయంలో అడ్వాన్స్ బుకింగ్స్ కీలకం కానున్నాయి. హిందీ మార్కెట్, ఓవర్సీస్ కలెక్షన్లు, పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్.. ఇవ‌న్నీ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలను పెంచుతున్నాయి. హైప్ ప‌రంగా చూసుకుంటే హిస్టరీ రిపీట‌య్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నెక్స్ట్ జనరేషన్ యూనివర్స్ ట్రెండ్

ఈ ఫ్రాంచైజ్‌ల స‌క్సెస్ తో ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో సినిమాటిక్ యూనివర్స్ మోడల్‌పై చర్చలు మొదలయ్యాయి. కెజిఎఫ్ ప్రపంచాన్ని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా టాక్సిక్ లాంటి ప్రాజెక్టులపై ఆసక్తి పెరుగుతోంది. క్యారెక్ట‌ర్ల‌ మధ్య కనెక్షన్స్, స్పిన్-ఆఫ్స్, క్రాస్ ఓవర్స్ లాంటి అంశాలు ఫ్యూచ‌ర్ లో సాధ్యమవుతాయనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. పుష్ప సిరీస్ కూడా ఈ భాగంతో ముగుస్తుందా? లేక కొత్త క్యారెక్టర్లతో విస్తరించి యూనివర్స్‌గా మారుతుందా? అన్నది ప్ర‌శ్న‌గా మారింది. గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కథా విస్తరణ, పాత్రల డెప్త్, వరుస సీక్వెల్స్ లాంటి వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, పాన్ ఇండియా ఫ్రాంచైజ్ రేస్, భారీ బాక్సాఫీస్ అంచనాలు, యూనివర్స్ కాన్సెప్ట్ అన్నీ క‌లిపి ఈ సినిమాల‌పై ఉన్న ఆస‌క్తిని మ‌రింత‌ పెంచుతున్నాయి. మ‌రి రిలీజ్ త‌ర్వాత ఈ ఫ్రాంచైజ్ సినిమాలు ఎలాంటి సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తాయో చూడాలి.

Tags:    

Similar News