శ్రీదేవి-నాగార్జున జంట రేర్ ఫోటో వైరల్
నటశిఖరం ఏఎన్నాఆర్ సరసన కథానాయికగా నటించిన అతిలోక సుందరి శ్రీదేవి ఆ తర్వాత ఆయన వారసుడు నాగార్జున సరసన కథానాయికగా నటించారు. ఆఖరి పోరాటం.. ఖుదాగవా (హిందీ).. గోవింద గోవింద లాంటి చిత్రాల్లో ఈ జోడీ రొమాన్స్ అక్కినేని అభిమానుల్లో ప్రముఖంగా చర్చకు వచ్చింది. తండ్రి కొడుకులతో శ్రీదేవి రొమాన్స్ ప్రధానంగా నాటి యువతరాన్ని ఆకర్షించింది. ఇక ఆర్జీవీ తెరకెక్కించిన సంచలనాల రంగీలా చిత్రంలోనూ నాగార్జున- శ్రీదేవి జోడీగా నటించాల్సింది. కానీ కుదరలేదు.
ఇంతకుముందు దుబాయ్ హోటల్ లో శ్రీదేవి ఆకస్మికంగా మరణించిన అనంతరం షాక్ కు గురైన నాగార్జున పలు ఆసక్తికర సంగతుల్ని చెప్పారు. శ్రీదేవి తనతో తన తండ్రిగారితో కలిసి ఎలా పనిచేశారో నాగార్జున గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి మరణం తనకు ఒక పాఠమని.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో శ్రీదేవి ప్రయాణం అసాధారణమైనదని అన్నారు.
నాన్న ( అక్కినేని నాగేశ్వర రావు) గారికి కుమార్తెగా నటించిన శ్రీదేవి ఆ తరువాత అనేక చిత్రాలలో ఆయన సరసన నాయికగా నటించారు. తర్వాత నాకు సహనటి.. ఎవరితో నటించినా శ్రీదేవి తన పాత్రలో లీనమవుతారు.. అని తెలిపారు. శ్రీదేవి- నాగార్జున జంటగా నటించిన సినిమా నుంచి ఓ అరుదైన ఫోటో తాజాగా అంతర్జాలంలో వైరల్ గా మారింది.