బ్రేక్ వచ్చినా క్రేజ్ తగ్గే ఛాన్సే లేదా?

సినిమా విడుదల తర్వాత సమంత చేసిన కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ స్థాయి విజయాన్ని తాను కూడా ఊహించలేదన్న ఫుల్ నాఆమె మాటల్లో కనిపించిందని అభిమానులు అంటున్నారు.

Update: 2026-06-29 03:57 GMT

సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు కెరీర్ మధ్యలో బ్రేక్ తీసుకోవడం కొత్త విషయం కాదు. వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలు, సరైన కథల కోసం ఎదురుచూడటం లేదా అవకాశాలు తగ్గడం వంటి కారణాలతో చాలా మంది కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటారు. అయితే ఒకసారి బ్రేక్ తీసుకుంటే ప్రేక్షకులు మరిచిపోతారా? లేక మంచి సినిమా వస్తే మళ్లీ అదే క్రేజ్ దక్కుతుందా? అనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ కనిపించే క్యాస్టింగ్, ఇప్పుడు కథల ఎంపికలో ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే తక్కువ సినిమాలు చేస్తున్నారు. దీంతో వారి అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోతుందనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. కానీ ఇటీవల కొన్ని చూస్తే పరిస్థితి పూర్తిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆ చర్చకు ప్రధాన కారణంగా స్టార్ హీరోయిన్ సమంత పేరు వినిపిస్తోంది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇటీవల విడుదలైన 'మా ఇంటి బంగారం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మంచి రెస్పరా పాటు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు సాధిస్తుండటంతో అందరి దృష్టి మళ్లీ సమంతపైనే పడింది. ఆమె రీఎంట్రీకి ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.

సినిమా విడుదల తర్వాత సమంత చేసిన కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ స్థాయి విజయాన్ని తాను కూడా ఊహించలేదన్న ఫుల్ నాఆమె మాటల్లో కనిపించిందని అభిమానులు అంటున్నారు. దీంతో మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే అభిప్రాయం బలపడుతోంది. నిజానికి ప్రేక్షకులు ఇప్పుడు హీరో లేదా హీరోయిన్ ఎంత గ్యాప్ తీసుకున్నారన్నది కంటే, ఎలాంటి సినిమాతో వస్తున్నారన్న విషయానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

కథ కొత్తగా ఉంటే, నటన ఆకట్టుకుంటే, సినిమా బాగుంటే ఆ గ్యాప్‌ ను పెద్దగా పట్టించుకోవడం లేదని ఇటీవల వచ్చిన విజయాలు చెబుతున్నాయి. సోషల్ మీడియా కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. సినిమాలకు దూరంగా ఉన్నా అభిమానులతో టచ్‌ లో ఉండే అవకాశం ఇప్పుడు సెలబ్రిటీలకు ఉంది. దీంతో వారు ప్రేక్షకులకు దూరమయ్యే పరిస్థితి ఉండటం లేదు.

ఒక మంచి సినిమా ప్రకటించినా, టీజర్ లేదా ట్రైలర్ విడుదలైనా మళ్లీ భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంటోంది. అయితే కేవలం బ్రేక్ తర్వాత రావడం మాత్రమే విజయానికి సరిపోదు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గ సినిమా ఉండాలి. సరైన కథ, స్ట్రాంగ్ రోల్, మంచి ప్రదర్శన ఉంటేనే ఆ క్రేజ్ మళ్లీ రిజల్ట్ లో కనిపిస్తుంది. లేదంటే గ్యాప్ తీసుకున్నా, తీసుకోకపోయినా రిజల్ట్ ఒకటే అవుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న అభిప్రాయం కూడా ఇదే.

కెరీర్‌ లో బ్రేక్ రావడం అనేది క్రేజ్ తగ్గిపోవడానికి తప్పనిసరి కారణం కాదని, ప్రేక్షకులు మంచి సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారని చెబుతున్నారు. ఒక్క హిట్ పడితే మళ్లీ అదే క్రేజ్, మార్కెట్, అవకాశాలు తిరిగి వస్తాయని భావిస్తున్నారు. ఏదేమైనా కాలం మారిన కొద్దీ ప్రేక్షకుల ఆలోచన కూడా మారింది. బ్రేక్ వచ్చినా క్రేజ్ తగ్గే ఛాన్స్ తప్పనిసరిగా ఉండదని, సరైన సమయంలో ఒక్క మంచి హిట్ పడితే మళ్లీ అదే స్టార్‌ డమ్‌ ను అందుకోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది.

Tags:    

Similar News