• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'స్కైలాబ్' నుంచి సూపర్బ్...

'స్కైలాబ్' నుంచి సూపర్బ్ సాంగ్.. 'రారా లింగా'..!

By - Tupaki Desk
Update: 2021-11-26 02:48 GMT
సత్యదేవ్ - నిత్యామీనన్ - రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ''స్కైలాబ్''. 1979 బ్యాక్ డ్రాప్ లో విభిన్నమైన కథ కథనాలతో విశ్వక్ కందెరావ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. డిసెంబర్ 4న ఈ సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - క్యారక్టర్ పోస్టర్స్ - ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి.

ఈ క్రమంలో తాజాగా 'రారా లింగా' అనే సాంగ్ లిరికల్ వీడియోని యువసామ్రాట్ నాగచైతన్య లాంచ్ చేసి చిత్ర బృందానికి విషెస్ తెలియజేశారు.

'రారా లింగా రారా లింగా.. కథ చెబుతా కచ్చితంగా.. రారా లింగా రామాలింగా.. ఇనుకోరా సుబ్బరంగా' అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది. సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్.

విహారి ఈ పాటను జానపదం శైలిలో క్లాసికల్ రిథమ్ తో కంపోజ్ చేశారు. సానపాటి భరద్వాజ్ పాత్రో మంచి సాహిత్యం అందించగా.. సింగర్ సీన్ రోల్డన్ తన వాయిస్ తో మ్యాజిక్ చేశారు. ఆదిత్య జవ్వడి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేశారు.

'స్కైల్యాబ్' చిత్రాన్ని రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫీచర్స్ - నిత్యామీనన్ కంపెనీ బ్యానర్స్ పై పృథ్వీ పిన్నమరాజు - నిత్యా మీనన్ సంయుక్తంగా నిర్మించారు.

అమెరికా మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం స్కైలాబ్ భూమ్మీద పడుతుందని 1979లో జరిగిన ప్రచారంతో, కరీంనగర్ జిల్లాలోని బండ లింగంపల్లి గ్రామంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనే కథాంశంతో ఈ కామెడీ డ్రామా రూపొందింది.

ఇందులో ఆనంద్ పాత్రలో సత్యదేవ్.. గౌరీ అనే యువతి పాత్రలో నిత్యా మీనన్.. సుబేధార్ రామారావుగా రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు. తనికెళ్ళ భరణి - దర్శకుడు తరుణ్ భాస్కర్ - తులసి తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. వచ్చే నెల 4న రాబోతున్న 'స్కైలాబ్' సినిమా వీరందరికీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.



Full View
Tags:    
  • RaRa Linga Lyrical Song 
  • Skylab 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS