• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాపో19 టైటిల్‌.. ఫ‌స్ట్...

రాపో19 టైటిల్‌.. ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేస్తోంది

By - Tupaki Desk
Update: 2022-01-15 11:13 GMT
ఎన‌ర్జిటిక్ హీరో ట‌ర్న్డ్ ఉస్తాద్ రామ్ `రెడ్‌` త‌రువాత `పందెం కోడి` ఫేమ్ ఎన్ . లింగుసామి డైరెక్ష‌న్ లో ఓ మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నారు. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై శ్రీ‌నివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ న‌టిస్తున్న 19వ చిత్ర‌మిది. ఈ మూవీతో రామ్ త‌మిళ ప్రేక్ష‌కుల్ని కూడా ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఒకే సారి తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్వి భాషా చిత్రంగా ద‌ర్శ‌కుడు లింగు సామి ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.

ఉప్పెన‌, శ్యామ్ సింగ‌ రాయ్‌, బంగార్రాజు చిత్రాల ఫేమ్ కృతిశెట్టి, అక్ష‌ర గౌడ ఇందులో రామ్ కు జోడీగా న‌టిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ మూవీ అడుగ‌డుగున అడ్డంకుల‌తో ముందుకు సాగుతోంది. ముందు త‌మిళ నిర్మాత కె. ఇ. జ్ఞాన‌వేళ్ రాజా కార‌ణంగా వివాదాల్లోకెక్కిన ఈ మూవీ ఆ త‌రువాత హీరో రామ్ కు గాయం కార‌ణంగా ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది.

ఇటీవ‌లే గాయం నుంచి కోలుకున్న రామ్ త‌న అభిమానుల‌తో క‌లిసి న్యూ ఇయ‌ర్ క్యాలెండ‌ర్ ని విడుద‌ల చేశారు. దీంతో ఆయ‌న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ప్రారంభిం అయిన‌ట్టుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే తాజాగా సంక్రాంతి సంద‌ర్భంగా మేక‌ర్స్ సినీ ల‌వ‌ర్స్ కి సాలీడ్ అప్ డేట్ ఇచ్చారు. సంక్రాంతి సంద‌ర్భంగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన మేక‌ర్స్ ఈ మూవీ టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు.

సంక్రాంతి ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 17న మ‌ధ్యాహ్నం 12:07 నిమిషాల‌కు ఈ మూవీ టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించి స‌ర్ ప్రైజ్ చేశారు. ఎన్‌. లింగుసామి అంటే వెంట‌నే గుర్తొచ్చే మూవీ `పందెం కోడి` ఆ తరువాత కార్తి `ఆవారా`. ఆ సినిమాకు మించి రామ్ తో చేస్తున్న సినిమా వుంటుంద‌ని చెబుతున్నారు. యాక్ష‌న్ చిత్రాల స్పెష‌లిస్ట్ గా లింగుసామికి మంచి పేరుంది.

ఆ పేరుకు త‌గ్గ‌ట్టే ఈ మూవీలో యాక్ష‌న్ స‌న్నివేశాలు అదిరిపోనున్నాయ‌ని, అందు కోస‌మే కోలీవుడ్ ఫేమ‌స్ ఫైట్ మాస్ట‌ర్స్ అన్బు - అరివు ల‌ని ఈ మూవీ కోసం తీసుకున్నార‌ని చెబుతున్నారు. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి బుర్రా సాయి మాధ‌వ్ మాట‌లు రాస్తున్నారు. ఆది పినిశెట్టి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీకి సుజిత్ వాసుదేవ్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు.  
Tags:    
  • Ram Pothineni 
  • RAPO19 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Copyright @2026

Powered by Blink CMS