• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మారుతియే పక్కా కమర్షియల్:...

మారుతియే పక్కా కమర్షియల్: రావు రమేశ్

By - Tupaki Desk
Update: 2022-06-27 02:30 GMT
తెలుగు తెరపై రావు గోపాలరావు విలనిజానికీ ఒక ప్రత్యేకత ఉంది. కూల్ గా కనిపిస్తూనే హీరోకి చెమటలు పట్టించే తీరు  .. ఆ డైలాగ్స్ లోని విరుపు మరొకరికి సాధ్యం కాలేదు. అలాంటి రావు గోపాలరావు తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రావు రమేశ్ కూడా విలన్ గా ఎదిగారు. తండ్రిని ఎంతమాత్రం అనుకరించకుండా తనదైన ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. 'పక్కా కమర్షియల్' సినిమాలో ఆయన ఒక కీలకమైన పాత్రను పోషించారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రావు రమేశ్ మాట్లాడుతూ .. " ఇందాకటి నుంచి  స్టేజ్ ఎవరు ఎక్కినా 'మీ దృష్టిలో  పక్కా కమర్షియల్' ఎవరు? అని అడుగుతున్నారు. నా దృష్టిలో అల్లు అరవింద్ గారు గానీ .. గోపీచంద్ గారు గానీ .. రాశి ఖన్నా గాని పక్కా కమర్షియల్ కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్లలో పక్కా కమర్షియల్ అంటే మారుతి గారే. ఎందుకు మారుతి గారు పక్కా కమర్షియల్ అంటే, కేవలం ఆయన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా తీసే డైరెక్టర్ కనుక. ఇంతకు మించిన పక్కా కమర్షియల్ డైరెక్టర్ మరొకరు ఉండరు.

ఇంతకుముందు నేను మారుతి గారి దర్శకత్వంలో ' ప్రతిరోజూ పండగే' సినిమా చేశాను. అందులోని సీన్స్ కథను బట్టి ఉంటాయి. కానీ ఈ సినిమాలో మేము సీన్ దాటేసి చేయవలసి వచ్చింది. ఎందుకండీ అని ఏ డౌట్ ను అడిగినా,  ఇలా ఉంటే ఆడియన్స్ ఇష్టపడతారు సార్ అనేవారు. నిజంగా ఆయనతో కలిసి పనిచేయడం  జోష్ ను ఇస్తుంది. తన సినిమాల్లో కేవలం హీరోకి మాత్రమే కాకుండా, ఆయన చుట్టూ ఉండే సపోర్టింగ్ రోల్స్ కి చాలా స్పేస్ ఇస్తారు. ఈ సినిమా విషయంలో గోపీచంద్ గారు చాలా స్పోర్టివ్ గా ఉన్నారు. రాశిఖన్నా గారు కామెడీ ఇరగదీశారు.

నాన్నగారు విలన్ గా చేసిన సినిమాల్లో ఆయన పంచ లాగేస్తూ అల్లు రామలింగయ్య గారు కనిపించేవారు. అలా ఈ సినిమాలో నా వెనుక అజయ్ ఘోష్ గారిని పెట్టిన విధానం బాగుంది. ముఖ్యంగా కెమెరా వర్క్ .. సంగీతం ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా హిట్ కావాలని ఇందులో చేసిన ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందులో ముందు నేనుంటాను. మారుతి గారి సినిమాల్లో డైలాగ్ చెప్పేసి వెళ్లడం కుదరదు .. ఎందుకంటే ఆయన స్టైల్ వేరు. కామెడీనీ .. ఎంటర్టైన్ మెంట్ ను అందించే విషయంలో ఆయన మార్క్ వేరే. అందుకు నేను ఆయనకి హ్యాట్సాఫ్ చెబుతున్నాను" అంటూ ముగించారు. 
Tags:    
  • Rao Ramesh 
  • Pakka Commercial 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS