ఫోటో స్టోరీ: కరువు ప్రాంతవాసి!

Update: 2019-10-14 07:47 GMT
బాలీవుడ్ లోని హాట్ జంటలలో దీప్-వీర్ జంట టాప్ ప్లేస్ లోనే ఉంటుంది. కొన్నేళ్ళ లవ్వాట తర్వాత వివాహం చేసుకుని ఒక్కటైన రణవీర్ సింగ్.. దీపిక పదుకొనే  జంట ఇప్పటికీ మీడియా దృష్టిని.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు.  దీపిక ఎప్పుడూ గ్రేస్ ఫుల్ గా ఉంటుంది కానీ రణవీర్ అందుకు పూర్తి వ్యతిరేకం.  24 గంటలూ బల్లె బల్లె డ్యాన్స్ మూడ్ లో ఉంటాడు. సహజంగా కొందరు హీరోలకు ఎనర్జీ ఉంటుంది.  రణవీర్ విషయంలో అది డబల్.  అది ఒక్కోసారి వెకిలిగా కూడా అనిపిస్తుంది.  అయితే రణవీర్ చాలా ప్రతిభావంతమైన నటుడు.. అందుకే ఈ అతిని ప్రేక్షకులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తారు.

రణవీర్ కు తన సతీమణి అంటే వల్లమాలిన ప్రేమ.  ఆ విషయం ఎప్పుడూ దాచుకోడు.  కొంతకాలం క్రితం ఒక ఫంక్షన్ కు హాజరయితే అక్కడ తన సతీమణి చెప్పులను చేత్తో పట్టుకుని వెనక నిలుచున్నాడు.  ఇలాంటి పత్నిభక్తి రేర్ కావడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే నిన్న రాత్రి రణవీర్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో చేశాడు.  ఈ ఫోటోకు "క్యాప్షన్ అవసరం లేదు. @దీపిక పదుకొనే #రామ్ లీలా" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.  ఈ క్యాప్షన్ లోనే ఒక కన్నుగీటే ఎమోజిని కూడా జోడించాడు.  ఇక ఫోటో విషయానికి  వస్తే ఇప్పటిది కాదు. 'రామ్ లీలా' లో నటించిన సమయంలో తీసిన ఫోటో.  దీపిక వెనక కూర్చున్న రణవీర్ ఆమె నడుమును తదేకంగా చూస్తూ మోహంతో ఉన్న మన్మథుడు-2 లా ధ్యానం చేస్తున్నాడు!

ఇలాంటి ఫోటోలకు స్పందన ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.  మొదట శ్రీమతి దీపిక స్పందిస్తూ "7 ఏళ్ళయింది.. ఏం మారలేదు #నీ కళ్ళు నాపైనే #నా కళ్ళునీపైనే" అంటూ కత్తి లాంటి రిప్లై ఇచ్చింది.  ఆయుష్మాన్ ఖురానా.. పరిణీతి చోప్రా.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. హుమా ఖురేషి.. ఇలా ఎంతో మంది బాలీవుడ్ నటులు 'హహహహ' అనే అక్షరాలతో తమ స్పందన తెలిపారు. ఇక లైకులకు లెక్కే లేదు.  ఇక అసాధారణ నెటిజన్ల కామెంట్లు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.  "రణవీర్ భాయ్.. నీ చూపు సరే.. నిన్ను వెనక ఓ అమ్మాయి చూస్తోంది చూడు" అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఇక ఈ ఫోటో గురించి ఒక్క ముక్కలో టిక్ టాక్ స్టార్ ఉప్పల్ బాలు భాషలో మోటుగా చెప్పుకోవాలంటే రణవీర్ కు మంచి కసి ఉంది..!!


Tags:    

Similar News