అందమైన అమ్మాయి గెటప్ లో రాక్ స్టార్
స్టార్ హీరోలకు లేడీ గెటప్స్ ధరించడం కొత్తేమీ కాదు. పాత్ర డిమాండ్ మేరకు ఎలాంటి ఆహార్యంలోనైనా ఒదిగిపోవడానికి రెడీగా ఉంటారు. ప్రయోగాలకు వెనుకాడని స్టార్లు ఎందరో ఉన్నారు. విశ్వ నటుడు కమల్ హాసన్.. చియాన్ విక్రమ్.. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ సహా ఇంకా ఎందరో స్టార్ హీరోలు స్త్రీ పాత్రల్లో మెప్పించారు. ఇక బాలీవుడ్ లోనూ చాలామంది స్టార్ హీరోలు స్క్రిప్ట్ డిమాండ్ మేరకు లేడీ గెటప్ లో మెప్పించిన సందర్భాలున్నాయి. `సంజు` చిత్రంలో రాక్ స్టార్ రణబీర్ కపూర్ సైతం లేడీ గెటప్ లో మెప్పించారు. కొన్ని గంటల పాటు లేడీ మేకప్ ధరించి నటించారు. తాజాగా రణబీర్ మరోసారి స్త్రీ వేషధారణలో మెప్పించడానికి రెడీ అవుతున్నారు.
అయితే ఈసారి సినిమా కోసం కాదు. ఓ కమర్శియల్ యాడ్ కోసం ఆయన లేడీ గెటప్ వేస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన వీడియో ఒకటి ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్..ప్రోస్తటిక్ ఆర్టిస్ట్ ప్రీత్ షీల్ సింగ్ డిసౌజా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసారు. ఇందులో రణబీర్ తల వెంట్రుకుల దగ్గర నుంచి కాలి గోటి వరకూ పూర్తిగా అమ్మాయి వేషధారణలోకి దూరిపోయారు. రణబీర్ కూర్చొని ఉండగా మేకప్ ఆర్టిస్టులంతా ఆయనకు మేకప్ వేస్తున్నారు. దీని వెనుక శ్రమని సైతం రివీల్ చేసారు. పని చేయడంతోనే పూర్తి రోజు గడిచిపోయిందని ప్రతీషీల్ తెలిపారు. మరి ఈ గెటప్ లో రణబీర్ ఎలా ఉంటారు? అన్నది యాడ్ టెలికాస్ట్ అయితే కానీ తెలియదు.
అయితే ఈ వీడియో రిలీజ్ అయ్యే సమయానికి రణబీర్ మహిళా వస్త్రధారణతో లేరు. ఆయన కేవలం ప్యాంట్ షర్టులో నే ఉన్నారు. మరి అందమైన అమ్మాయిగా మారిన తర్వాత ఆ ఆహార్యం రాక్ స్టార్ కి ఎలా ఉంటుందో చూడాలి. ఈ యాడ్ కోసం ఆయన భారీగానే పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రణబీర్ `బ్రహ్మస్త్ర`లో నటిస్తున్నారు. అలాగే ఎల్ .యు. వి రంజన్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు.