ద‌గ్గుబాటి వెడ్డింగ్ స్పెష‌ల్.. రెండు క‌ళ్లు చాల‌వేమో!

Update: 2020-08-08 06:00 GMT
టాలీవుడ్ హంక్ హీరో రానా ఓ ఇంటివాడ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. నేడే(ఆగ‌స్టు 8) బిగ్ డే. తాను వ‌ల‌చిన‌ మిహీకా బజాజ్ తో వివాహం రామానాయుడు స్టూడియోస్ లో జ‌ర‌గ‌నుంది. మాంగ‌ళ్యానికి 8.30 పీఎం ముహూర్తం ఫిక్స్. గ‌త రెండు మూడు రోజులుగా వ‌ర‌స ఈవెంట్ల‌తో రానా - మిహీక జంట పూర్తి ఆనంద‌డోలిక‌ల్లో మునిగి తేలుతున్న సంగ‌తి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు ఒక్కొక్క‌టిగా అంత‌ర్జాలంలోకి రివీల‌వుతున్నాయి.

తాజాగా రానా పోస్ట్ చేసిన ఓ ఫోటో వెరీ స్పెష‌ల్ అని చెప్పాలి. ఈ ఫోటోలో ఓ వైపు బాబాయ్ వెంక‌టేష్.. మ‌రోవైపు డాడీ సురేష్ బాబు ఉన్నారు. తన తండ్రి బాబాయ్ లతో కలిసి ఎంతో ట్రెడిష‌న‌ల్ లుక్ లో క‌నిపిస్తున్నాడు రానా. నవ్వుతూ ఫోటోకి ఫోజిచ్చాడు. ద‌గ్గుబాటి వెడ్డింగులో వెరీ స్పెష‌ల్ ఫోటో ఇది.

మిహీక‌తో రానా ప్రేమాయ‌ణం వెన‌క చాలా సంగ‌తు‌లే ఉన్నాయి. వెంకీ కుమార్తెకు మిహీక క్లోజ్ ఫ్రెండ్. ఆ క్ర‌మంలోనే రానాతో ఇంట‌రాక్ష‌న్.. అనంత‌రం స్నేహం.. ఆపై నిశ్చితార్థం వ‌గైరా వ‌గైరా తెలిసిన వ్య‌వ‌హారాలే. మేలో ప్ర‌పోజ్ చేస్తే.. ఆగ‌స్టు నాటికి పెళ్లితో ఓ ఇంటివాడైపోతున్నాడు.. ద‌టీజ్ రానా.
Tags:    

Similar News